Share News

Anam: దటీజ్ చంద్రబాబు.. భద్రతను పక్కనబెట్టి మరీ ప్రజల్లోకి వచ్చారు

ABN , Publish Date - Aug 21 , 2024 | 02:56 PM

Andhrapradesh: జిల్లా ప్రజలకు దశాబ్ధాల కాలంగా సోమశిల ప్రాజెక్ట్ జీవనాడిగా ఉందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సోమశిల డ్యాం కెపాసిటీని ఎన్టీఆర్ 78 టీఎంసీలకి పెంచారని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రానికి నీరందించేలా రూపకల్పన చేశారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసిందని..

Anam: దటీజ్ చంద్రబాబు.. భద్రతను పక్కనబెట్టి మరీ ప్రజల్లోకి వచ్చారు
Minister Anam Ramnarayanareddy

నెల్లూరు, ఆగస్టు 21: జిల్లా ప్రజలకు దశాబ్ధాల కాలంగా సోమశిల ప్రాజెక్ట్ జీవనాడిగా ఉందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramnarayanareddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సోమశిల డ్యాం కెపాసిటీని ఎన్టీఆర్ 78 టీఎంసీలకి పెంచారని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రానికి నీరందించేలా రూపకల్పన చేశారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసిందని.. అది రైతులకి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులను గాలికొదిలేసిందని విమర్శించారు. వరదలు, వర్షాలు వచ్చి సాగునీరంతా సముద్రానికి పోయినా చూస్తూ ఉన్నారే తప్ప... ఇతర ప్రాంతాలకి ఆ నీటిని తరలించి దాహర్తిని తీర్చే ప్రయత్నం చేయలేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోలేదన్నారు.

Nara Lokesh: బాబు కాదు.. ఢిల్లీలో ఇకపై చక్రం తిప్పేది చినబాబేనట..!!


ఒక్క చెట్టు చిటారుకొమ్మ కూడా కొట్టలేదు..

సోమశిల డ్యాంకి జరిగిన నష్టాన్ని స్వయంగా చూసేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu)వచ్చారన్నారు. ‘‘గతంలో సీఎం రావాలంటే చెట్లు కొట్టాలి, తెరలు కట్టాలి. ఇప్పుడు 95 శాతం ప్రజలు ఆమోదించిన సీఎం వస్తే ఒక్క చెట్టు చిటారుకొమ్మ కూడా కొట్టలేదు. ప్రజలతో చర్చిస్తేనే వారి బాధలు తెలుసుకోగలమనేది చంద్రబాబు ఆలోచన. దేశంలో అత్యంత భద్రత కలిగిన సీఎం చంద్రబాబు. చంద్రబాబు తన భద్రతని పక్కనపెట్టి ప్రజల్లోకి వచ్చారు’’ అని తెలిపారు. మూడేళ్లు పోరాటం చేసినా జగన్ ప్రభుత్వం సోమశిల డ్యాంని పట్టించుకోలేదన్నారు. రూ.99కోట్లు నిధులిస్తామని ఒక్క రూపాయి‌ ఇవ్వలేదని.. గేట్ల ఐరన్ రోప్‌లకు అవసరమైన గ్రీసుకి కూడా ఇవ్వలేదన్నారు. మరోవైపు అన్నమయ్య ప్రాజెక్టు అవుతుందేమోనని భయపడ్డామన్నారు.


వచ్చే సీజ్‌‌కు నీరందిస్తాం...

అధికారంలోకి వచ్చి 70 రోజులు గడవక ముందే చంద్రబాబు సోమశిల డ్యాంని పరిశీలించారని.. వెంటవెంటనే పనులు చేయమని సీఎం ఆదేశిలిచ్చారన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోపు 35వేల క్యూబిక్కుల కాంక్రీటు పనులు చేయాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. సోమశిలలో ఇవాళ 26 టీఎంసీల‌ నీరుందన్నారు. తిరుమల, తిరుపతి తాగునీటి అవసరాల కోసం త్వరలోనే 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. హైలెవల్ కెనాల్ ఫేజ్ 1 పనులు 63 శాతం పూర్తయ్యాయయని తెలిపారు. జగన్ ప్రభుత్వం, కాంట్రాక్టర్లకి లబ్ధి ప్రయోజనాల కోసం సెకెండ్ ఫేజ్ మొదలెట్టారన్నారు. ఆదాల, పొంగులేటి, వీవీఆర్ కంపెనీలకి పనులు ఇచ్చి, బిల్లులు చేశారన్నారు. అవసరమైన పడమటినాయుడుపల్లి, పొంగూరు రిజర్వాయర్లు పట్టించుకోలేదన్నారు. అవి రెండూ పూర్తైతే 25 వేల ఎకరాలకి సాగునీరు, 15 వేలమంది దాహార్తి తీర్చొచ్చని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆ పనులకి అవసరమైన సుమారు రూ.200కోట్లుకిపైగా నిధులు ఇస్తామని చెప్పారన్నారు. వచ్చే సీజన్‌కు నీరందించే ప్రణాళిక సూచించారని తెలిపారు.

Hyderabad: ఫిర్యాదుల వరద.. నాగార్జునకు షాక్ తప్పదా..!?


సీఎం సూచిస్తే...

సోమశిల వాసులు ప్రజావేదికలో 30 పడకల ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి కోరగా, చంద్రబాబు మంజూరు చేశారన్నారు. టూరిజం అభివృద్దికి ఓకే చెప్పారన్నారు. సంజీవయ్య సోమశిల హైలెవల్ కెనాల్‌కు రూ.500 కోట్లకు పైగా చంద్రబాబు నిధులు ఇస్తామని చెప్పారన్నారు. సోమేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు హామీ ఇచ్చారన్నారు. సీఎం సూచిస్తే... సంగం, నెల్లూరు బ్యారేజీల పేర్లు మారుస్తామన్నారు. పేర్లు మార్పు గురించి ప్రశ్నించే హక్కు మాజీ మంత్రి కాకాణికి లేదన్నారు. కలకత్తాలో మెడికల్ కాలజీ విద్యార్ధిని ఘటన అత్యంత బాధాకరమన్నారు. వైద్యులు, వైద్య విద్యార్ధులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు. 2019లో 151 స్థానాల్లో వైసీపీ గెలిచిందని... అప్పుడు కూడా ఈవిఎంలే బలపరచాయా అని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలని గౌరవించడం నేర్చుకోవాలని హితవుపలికారు. ‘‘జగన్‌కు కోపం వస్తే ఏ కుర్చీ విసిరేస్తాడో, రాయి వేస్తాడో, కొడతాడోనని నేతలు బయపడి ఏదంటే, అది మాట్లాడుతున్నారు. పాపం విజయసాయి... మళ్లీ తిరిగి చూడలేదు. ఇంకోకాయన దోపిడీ కేసులో ఇరుక్కోబోతున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు. దగదర్తి ఎయిర్ పోర్టుని రామాయపట్నంలో నిర్మిస్తామన్నాని మంత్రి ఆనం రామనారయణ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Rajendraprasad: పంచాయతీల అభివృద్ధికి రూ.900 కోట్లు జమ చేయడంపై వైవీబీ హర్షం

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్షల్లో ఫ్రెషర్ల నియామకానికి కంపెనీలు రెడీ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 03:56 PM