Share News

Anam: లడ్డూ వివాదం.. జగన్‌పై మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 23 , 2024 | 04:27 PM

Andhrapradesh: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డులో కల్తీ నెయ్యి వాడి గత పాలకుల దోపిడి చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పరీక్షలు నిర్వహిస్తే నివేదికలలో జంతువుల కొవ్వు ఉందని స్పష్టం చేశాయన్నారు.

Anam: లడ్డూ వివాదం.. జగన్‌పై  మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు
Minister Anam Ramnarayana Reddy

నెల్లూరు, సెప్టెంబర్ 23: టీడీపీ ప్రభుత్వం (TDP Govt) అధికారంలోకి వచ్చాక గడిచిన 100 రోజుల్లో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramnarayana Reddy) తెలిపారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలోని పేరారెడ్డిపల్లి గ్రామంలో ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డులో (Tirumala Laddu) కల్తీ నెయ్యి వాడి గత పాలకుల దోపిడి చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశాలతో పరీక్షలు నిర్వహిస్తే నివేదికలలో జంతువుల కొవ్వు ఉందని స్పష్టం చేశాయన్నారు.

YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..


మూడు సంవత్సరాలు అనుభవం ఉండాల్సి ఉంటే సంవత్సరం కూడా అనుభవ లేని కంపెనీలకు కట్టపెట్టారన్నారు. జగన్ ముఖ్య మంత్రి అవడానికి సొంత బాబాయినే హత్య చేశారని... తిరుమలను దోచుకోమని మరో బాబాయిని పంపించారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంత అపచారం జరిగి ఉంటే ఏమి తెలియని నంగనాచిలా ప్రధానికి లేఖ రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక చీటర్..బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది మనోభావాలను దెబ్బ తీశారని జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


ఇంతకన్నా నిజం ఏం కావాలి: ఓవీ రమణ

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జరిగిన దుర్మార్గం మళ్లీ జరగ కూడదంటే పాలకమండలి సభ్యుల నియామకం నుంచి పర్చేజ్ కమిటీ వరకు ప్రతి అంశంలోనూ ప్రక్షాళన అవసరమని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓ.వి. రమణ స్పష్టం చేశారు. 1963లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో 11 మంది సభ్యులున్నారన్నారు. 1979 నాటికి పాలక మండలి సభ్యుల సంఖ్య 13కి చేరిందని చెప్పారు. ఇక 2004 నాటికి ఆ సంఖ్య కాస్తా 15 అయిందన్నారు. కానీ 2019లో ఆ సంఖ్యను 25కు పెంచారని ఈ సందర్బంగా ఒ.వి.రమణ గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫిషియో సభ్యుల నియామకం కూడా జరుగుతోందన్నారు. ఇటువంటి నియామకాలు తగవని కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన సూచించారు.

లోకల్ అడ్వైజరీ సభ్యుడుగా ఉన్న వ్యక్తికి ఓటింగ్ హక్కు ఉండదన్నారు. కానీ అలాంటి వ్యక్తిని పర్చేజ్ కమిటీ సభ్యుడిగా నియమించారని ఆయన వివరించారు. ఆ వ్యక్తి వల్లే ఈ దుర్మార్గం జరిగిందని ఓ.వీ.రమణ కుండ బద్దలు కొట్టారు. తుడా ఛైర్మన్‌ను టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండకూడదన్నారు. ఎందుకంటే.. తుడా పదవి సెక్యూలర్ పోస్టు అని స్పష్టం చేశారు. ఇక టీటీడీ బోర్డులో హిందువు మాత్రమే ఉండాలని స్పష్టం చేసినప్పుడు తుడా ఛైర్మన్‌గా రేపు అన్య మతస్తులను నియమిస్తే పరిస్థితి ఏమిటని ఆయన ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటమని చెపితే... శ్రీవారికి పోటీగా తిరుమలలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించారన్నారు. వారు చెబుతున్నట్లు ఇలాంటి వారు తప్పకుండా రక్తం కక్కుకుని చస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇష్టానుసారంగా మార్చేశారు..

తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి ఆగమోక్తమైన దిట్టం ఉంటుంది. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పేరుతో దిట్టాన్ని ఇష్టానుసారం మార్చేశారని విమర్శించారు. టెండర్ కండిషన్లను కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో ఇష్టానుసారంగా మార్చేశారని ఆరోపించారు. తాము ఎవరికి టెండర్ ఇవ్వాలనుకుంటున్నారో వారికి తగ్గట్టు టెండర్ కండిషన్లు మార్చుకున్నారన్నారు. టెండర్ కండిషన్లు మార్చటం వల్లే ఈ దుర్మార్గాలు జరిగాయన్నారు. అయితే 18 ట్యాంకర్లు రిటర్న్ చేశామని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారన్నారు. మరి అన్ని ట్యాంకులు రిటర్న్ చేశాక.. మళ్లీ వారి వద్దే నెయ్యి ఎందుకు కొనుగోలు చేశారంటూ సందేహం వ్యక్తం చేశారు. ఇది చాలు గోల్‌మాల్ జరిగిందనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఒవి రమణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంను ఆశ్రయించిన వైవీ...

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 04:27 PM