Share News

Minister Narayana: పన్నుల వసూలుపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Nov 30 , 2024 | 08:52 PM

ప్రజలని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. అభివృద్ది కోసమే పన్నుల వసూలు అని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పన్నుల చెల్లింపు విధానం ఒకేలా ఉంటుంది. నెల్లూరుకి ప్రత్యేకమేమీ ఉండదని స్పష్టం చేశారు.

Minister Narayana: పన్నుల వసూలుపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

నెల్లూరు: మౌలిక వసతులు సమకూరాలంటే, పన్నుల వసూలు ముఖ్యమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. అభివృద్ది కోసమే పన్నుల వసూలు అని తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించకుంటే, చట్టపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. కొంత సమయం ఇస్తాం. నిర్ణీత సమయంలోపు పన్నులు చెల్లించకుంటే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఏపీ వ్యాప్తంగా పన్నుల చెల్లింపు విధానం ఒకేలా ఉంటుంది. నెల్లూరుకు ప్రత్యేకమేమీ ఉండదని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న బిల్డింగ్ అనుమతులు పరిష్కరిస్తామని తెలిపారు. నగరంలో 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని. త్వరలో మరో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.


జగన్ అడ్డంగా బుక్కయ్యారు: సోమిరెడ్డి

somireddy.jpg

నెల్లూరు: సోలార్ విద్యత్తు ఒప్పందాల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ముమ్మాటికీ అవినీతికి పాల్పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. జగన్ అడ్డంగా బుక్కై, ఇప్పుడు బుకాయిస్తే కుదరదని అన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో జగన్ పేరు లేదట.. ఏపీ సీఎం అని ఉందట.. 2021 సీఎం ఆయన కాదా అని ప్రశ్నించారు. 2014 ధరలతో పోల్చుకుని 2021లో తక్కువ ధరకి కొనుగోలు చేశామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించే ప్యానళ్ల ఖర్చు రూ.15కోట్లు. ఇప్పుడవే ప్యానళ్ల ఖర్చు రూ.50లక్షలు అయ్యాయని తెలిపారు. జగన్‌పై ఉన్న రెండు డజన్ల కేసుల సంగతేమో కానీ, ఈ కేసులో ఫలితం అనుభచించక తప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - Nov 30 , 2024 | 08:55 PM