Share News

Jagdeep: నెల్లూరు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి

ABN , Publish Date - Aug 17 , 2024 | 12:01 PM

Andhrapradesh: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం ఉదయం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వెంకటాచలంలో ఉన్న అక్షర విద్యాలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ ఘన స్వాగతం పలికారు.

Jagdeep: నెల్లూరు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి
Vice President Jagdeep Dhan Khad

నెల్లూరు, ఆగస్టు 17: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం ఉదయం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వెంకటాచలంలో ఉన్న అక్షర విద్యాలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ ఘన స్వాగతం పలికారు. అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న స్వామి వివేకానందుని ప్రతిమకు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న సర్దార్ వల్లభ భాయ్ పటేల్ విగ్రహానికి కూడా జగదీప్ ధన్‌ఖడ్ నివాళులర్పించారు.

Tirupati: కలకత్తా ఘటనపై ఏపీ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు.. రోగుల ఆగ్రహం



ఆపై అక్షర విద్యాలయంలోని చిన్నారులతో ముచ్చటించారు. వారి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపరాష్ట్రపతి, పూర్వ ఉపరాష్ట్రపతి తిలకించారు. ఉపరాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి అక్షర విద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.

TG Politics: బీజేపీ, కాంగ్రెస్ పొలిటికల్ గేమ్.. మధ్యలో ఇరుక్కున్న బీఆర్‌ఎస్..!


కాగా.. జిల్లాలో పర్యటన నిమిత్తం ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి నెల్లూరులోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాచలంలోని అక్షర విద్యాలయం చేరుకుని అక్కడి విద్యార్థులతో ముచ్చటించి.. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌‌లలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు ఉపరాష్ట్రపతి తిరుగు ప్రయాణంకానున్నారు.


ఇవి కూడా చదవండి...

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!

Telangana: క్షమించు తల్లీ.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

Read Latest AP News And Telangana News

Updated Date - Aug 17 , 2024 | 12:01 PM