Share News

AP News: ఉమ్మడి నెల్లూరు జిల్లా: తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..

ABN , Publish Date - Jun 07 , 2024 | 06:57 AM

ఉమ్మడి నెల్లూరు: జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లకూరు మండలం, చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులపై వైసీపీ నాయకులు కర్రలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించారన్న కోపంతో వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన వర్గీయులతో అర్ధరాత్రి దాడి చేయించారు.

AP News: ఉమ్మడి నెల్లూరు జిల్లా: తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..

ఉమ్మడి నెల్లూరు: జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లకూరు మండలం, చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులపై (Father and Son ) వైసీపీ నాయకులు (YCP Leaders) కర్రలతో, రాళ్లతో దాడి (Attack) చేసి తీవ్రంగా గాయపరిచారు. వారు తెలుగుదేశం పార్టీకి (TDP) ఓట్లు (Votes) వేయించారన్న కోపంతో వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (Kamineni Satyanarayana Reddy) తన వర్గీయులతో అర్ధరాత్రి దాడి చేయించారు. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు విజయుల్ రెడ్డి, రాకేష్ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి.


కాగా ఎన్నికల నాటి నుంచి వైసీపీ అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఎన్నికల రోజు, తర్వాత వైసీపీ శ్రేణులు సృష్టించిన వీరంగం అంతా ఇంతా కాదు. ఈవీఎంలు పగలకొట్టడం దగ్గర్నుంచి సామాన్యులు, కూటమి నేతలపై విపరీతంగా దాడులు చేయడం, పోలింగ్ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడడం వంటివి చాలానే చేశారు. తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనలే ఆత్మకూరు నియోజకవర్గంలో పునరావృతం అయ్యాయి.


ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లితో సహా పలు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నడిరోడ్లపై మహిళలు, యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. బసవరాజుపాలెంలో ఇదేమిటని ప్రశ్నించిన గ్రామస్థులపై దాడి చేయగా.. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వేణు, ఎస్సై ముత్యాలరావుపైనా దాడులకు తెగబడ్డారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులే వెనతిరిగి వెళ్లిపోయిన వింత ఘటన చోటుచేసుకుంది. మేకపాటి, సీఎం జగన్ అండతోనే వీరంతా రెచ్చిపోతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనైనా చట్టాలకు లోబటి ఉండాలన్న ఇంగితం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వైసీపీ మూకలకు సంబంధించిన ఏదో ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీరి అరాచకాలకు అడ్డుకట్టపడాలంటే టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి అధికారంలోకి రావాలని కూటమి నేతలు కోరుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలనలో ప్రక్షాళన!

మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 07 , 2024 | 07:00 AM