Payyavula Keshav : ఏపీకి ఆర్థిక సాయం అందించండి
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:59 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు.

కేంద్ర పథకాలకు నిధులివ్వండి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో పయ్యావుల భేటీ
న్యూఢిల్లీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చిన పయ్యావుల మంగళవారం పార్లమెంటులో ఆమెను కలిశారు. ఏపీకి తగిన ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో 93 కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయలేదని, వాటి అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 73 పథకాలను పునరుద్ధరించిందని వివరించారు. రాష ్ట్రవాటా ఇచ్చిన పథకాలకు నిధులవ్వాలని, వెనుకబడిన ప్రాంతాలకిచ్చే నిధులు, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. మంత్రి వెంట టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.