Share News

Ponnur Court: వర్రా రవీందర్ రెడ్డిని మళ్లీ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

ABN , Publish Date - Dec 04 , 2024 | 09:05 PM

వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన వర్రా రవీందర్ రెడ్డిని బుధవారం పొన్నూరు కోర్టులో హాజరుపరిచారు. అతడికి 14 రోజుల రిమాండ్ విధించిందీ కోర్టు.

Ponnur Court: వర్రా రవీందర్ రెడ్డిని మళ్లీ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

గుంటూరు, డిసెంబర్ 04: సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేతలు, అగ్రనాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డిని పీటీ వారెంట్‌పై పొన్నూరు కోర్టులో బుధవారం పోలీసులు హాజరుపరిచారు. దీంతో అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఐటీ మంత్రి నారా లోకేష్‌పై వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టారు.

Also Read: వనదేవతల ఆగ్రహమా.. మేడారంలో ఏం జరుగుతోంది..


ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అతడిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో పొన్నూరు పోలీస్ స్టేషన్‌లో వర్రాపై కేసు నమోదు చేశారు. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై సైతం అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో అతడిపై వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని అతడిని పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో వైఎస్ షర్మిలే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే విధంగా వైఎస్ సునీత సైతం వర్రా రవీందర్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

Also Read: యూట్యూబ్‌లో మీకు సబ్ స్క్రైబర్లు పెరగడం లేదా? జస్ట్ ఇలా చేయండి


కడప జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్ర రెడ్డిని నవంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే, జూన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ప్రచారంలో భాగంగా వైఎస్ వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై వైఎస్ షర్మిల, వైఎస్ సునీత విమర్శించారు. ఈ నేపథ్యంలో వారిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.

Also Read: జాక్ పాట్ కొట్టిన రేవంత్ ప్రభుత్వం


ఆయా పోస్టుల్లో.. అవసరమైతే సునీతను కూడా లేపేయండి అంటూ రాసుకొచ్చినట్లు ఓ ప్రచారం జరిగింది. ఇక సీఎం వైఎస్ జగన్‌ తల్లి వైఎస్ విజయమ్మపైనా వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల, సునీతలు తీవ్ర కలత చెందారు. దాంతో వారు హైదరాబాద్‌ పోలీసులకు వర్రా రవీంద్ర రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు


మరోవైపు వైఎస్ షర్మిలపై మరీ దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టి వైరల్‌ చేశారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో కూటమి నేతలను అతడు వదల్లేదు. వారిపై అత్యంత హేయమైన రీతిలో పోస్టులు పెడుతు వచ్చాడు. దీంతో కూటమి పార్టీ శ్రేణులు వర్రా రవీందర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇంకోవైపు అతడిని అరెస్ట్ చేసేందుకు మీన మేషాలు లెక్కించారనే ఆరోపణల వచ్చాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీతోపాటు ఓ పోలీస్ అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Also Read: ఆ విషయం.. మా హోం మినిస్టర్ భువనేశ్వరి చూసుకుంటారు

Also Read: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన శ్రీహర్షిత


వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి అని.. అతడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుల్లో ఒకరిని చెబుతారు. ఇంకోవైపు.. పోలీసుల విచారణలో వర్రా రవీందర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. తాను సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయాలన్నా.. అవి వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి నుంచి కంటెంట్ వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. For Andhrapradesh News And Telugu News

Updated Date - Dec 04 , 2024 | 09:07 PM