Minister Gottipati: విద్యుత్ షాక్ ఘటనపై మంత్రి గొట్టిపాటి తీవ్ర దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Jul 23 , 2024 | 08:48 PM
కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ముగ్గురు యువకులు మృతిచెందడంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనం విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు విద్యార్థులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసినట్లు మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం: కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ముగ్గురు యువకులు మృతిచెందడంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనం విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు విద్యార్థులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసినట్లు మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ సిబ్బందికి సూచించారు. మృతుల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందజేస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే?
గౌతమ్, బాలాజీ, నజీర్ అనే ముగ్గురు యువకులు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పునుగోడుకు బైక్‌పై వెళ్తున్నారు. పునుగోడు ఎస్టీ కాలనీ వద్దకు రాగానే ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. 11కేవీ మెయిన్ లైన్ తీగలు కావటంతో ద్విచక్రవాహనం సహా ముగ్గురు యువకులు సజీవ దహనం అయ్యారు. విద్యార్థులంతా గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. మృతులంతా కనిగిరి విజేత కళాశాలలో చదువుతున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు శోకసద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి:
Minister Narayana: విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష..
Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?