Home » Kanigiri
గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తరిమేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టు గురించి చెప్పమని పులివెందుల ఎమ్మెల్యేకు సవాల్ చేశానన్నారు. కానీ పులివెందుల ఎమ్మెల్యే నుండి సౌండ్ లేదన్నారు.
కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ముగ్గురు యువకులు మృతిచెందడంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనం విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు విద్యార్థులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసినట్లు మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు డబ్బు కోసం న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బెదిరించడంతో పిల్లలతో సహా ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లల ఏడుపులు గమనించి కుటుంబ సభ్యులు వారిని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.