Raghurama Krishnaraju: సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై ప్రధానికి రఘురామ లేఖ
ABN , Publish Date - Mar 04 , 2024 | 01:51 PM
ప్రధాన మంత్రి మోదీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై లేఖలో ప్రస్తావించారు. ఎన్నడూ లేని విధంగా రూ.350 కోట్లకు సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టేశారన్నారు. ప్రధానమంత్రిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసే లోపే తాను లేఖ రాశానన్నారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం ఉల్లంఘనలు చేస్తోందని దీనిపై విచారణ చేయాలని కోరానన్నారు.
ఢిల్లీ: ప్రధాన మంత్రి మోదీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnaraju) లేఖ రాశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (AP Government)సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై లేఖలో ప్రస్తావించారు. ఎన్నడూ లేని విధంగా రూ.350 కోట్లకు సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టేశారన్నారు. ప్రధానమంత్రిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) కలిసే లోపే తాను లేఖ రాశానన్నారు.
ఏపీ ప్రభుత్వం (AP Government) రాజ్యాంగం ఉల్లంఘనలు చేస్తోందని దీనిపై విచారణ చేయాలని కోరానన్నారు. జగన్ ఎల్లుండి ప్రధానమంత్రిని కలవడానికి వస్తున్నారని తెలిసిందని రఘురామ పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ బ్యాంకు ముందుకు రాకపోతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సెక్రెటేరియట్ తాకట్టు పెట్టారన్నారు. రేపు వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకు యాజమాన్యం సెక్రెటేరియట్ లోకి కూడా రానివ్వదన్నారు. సెక్రెటేరియట్‌ను తాకట్టు పెడుతుంటే చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారో తెలియడం లేదని రఘురామ అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి