Share News

Lanka Dinakar: రివర్స్ టెండరింగ్ మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం

ABN , Publish Date - Jun 29 , 2024 | 12:19 PM

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ 2019కి ముందు మొత్తం 72% పూర్తైందని తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 14,418.39 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు.

Lanka Dinakar: రివర్స్ టెండరింగ్ మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం

విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ 2019కి ముందు మొత్తం 72% పూర్తైందని తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 14,418.39 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ఆరోపణలకు సాక్ష్యలు చూపలేదని లంకా దినకర్ అన్నారు. పనులు కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపేశారని అన్నారు. ప్రాజెక్టు వ్యయం తగ్గకపోగా దాదాపు మరో 33% పెరిగిందని లంకా దినకర్ పేర్కొన్నారు. "రివర్స్ టెండరింగ్" మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ పురోగతిలో తప్పుడు పాలన, అవినీతి కారణంగా వ్యయం పెరిగి పోయిందని పేర్కొన్నారు.


జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2019 లో ప్రమాణం చేసే నాటికి పోలవరం నిర్మాణం పనులు 70 % పైగా జరిగాయన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో కనీసం 10 % పనులు కూడా పూర్తి కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న 960 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ అస్మదీయుల ద్వారా కొట్టేయడానికి ఉన్న శ్రద్ధ, ప్రాజెక్టు పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టలేదని లంకా దినకర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తీ చేయకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్, రివిట్మెంట్, ఎర్త్ కామ్ రాక్ ఫీల్ డ్యామ్ దెబ్బతిని మూడు వేల కోట్లకు పైగా నిధులు వృథా అయ్యాయన్నారు. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అసలు పట్టించుకోలేదన్నారు. రాబోయే 4 సంవత్సరాలలో ఎన్డీఏ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర సహకారంతో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని లంకా దినకర్ పేర్కొన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 12:20 PM