Trains Cancelled: రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు
ABN , Publish Date - Sep 01 , 2024 | 09:04 PM
మచిలీపట్నం- విశాఖపట్టణం మధ్య నడిచే 17219 నెంబర్ రైలును సోమవారం రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైలు నెంబర్ 17247 ధర్మవరం- మచిలీపట్నం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు వర్షపు నీరు రైల్వే ట్రాక్‌లపై చేరింది. కేస సముద్రం సమీపంలో రైల్వే ట్రాక్ వరద ప్రభావానికి కొట్టుకుపోయింది. దీంతో సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ట్రాక్ మరమ్మతు పనులను ఇప్పటికే ప్రారంభించింది. వీలైనంత త్వరగా ఈ రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వర్షాలు తగ్గితే సోమవారం సాయంత్రంలోపు ఈ రైలు మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రాక్ రమమ్మతు పనులు అవుతుండటంతో మంగళ, బుధవారాల్లోనూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.
AP Rains: ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. వివరాలివే..
రేపు రద్దైన రైళ్లు..
మచిలీపట్నం- విశాఖపట్టణం మధ్య నడిచే 17219 నెంబర్ రైలును సోమవారం రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైలు నెంబర్ 17247 ధర్మవరం- మచిలీపట్నం, రైలు నెంబర్ 17256 లింగంపల్లి-నరసాపురం, రైలు నెంబర్ 17248 ధర్మవరం-నరసాపురం, రైలు నెంబర్ 17209 ఎస్ఎమ్‌విటి బెంగళూరు- కాకినాడ టౌన్ రైళ్లను సోమవారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
CM Chandrabab: గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రేపు, ఎల్లుండి రద్దైన రైళ్లు..
రైలు నెంబర్ 07783 విజయవాడ- గుంటూరు, రైలు నెంబర్ 07779గుంటూరు- మాచర్ల, రైలు నెంబర్ 07580 మాచర్ల-నడికుడి, రైలు నెంబర్ 07579 నడికుడి-మాచర్ల, రైలు నెంబర్ 07780 మాచర్ల- గుంటూరు, రైలు నెంబర్ 07788 గుంటూరు-విజయవాడ, రైలు నెంబర్ 07276 కాచిగూడ-మిర్యాలగూడ, రైలు నెంబర్ 07277 మిర్యాలగూడ-నడికుడి మధ్య రైళ్లను సోమవారం, మంగళవారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
మూడు రోజుల పాటు..
రైలు నెంబర్ 07973 నడికుడి- మిర్యాలగూడ, రైలు నెంబర్ 07974 మిర్యాలగూడ- నడికుడి మధ్య రైలును సోమవారం నుంచి బుధవారం వరకు అంటే సెప్టెంబర్ 2 నుంచి 4వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
AP Rains: ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. వివరాలివే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here