AP Assembly: శాసనసభ నిరవధిక వాయిదా.. టీడీపీ సభ్యుల సంఖ్యను తప్పుగా చెప్పిన స్పీకర్
ABN , First Publish Date - 2024-02-08T14:51:45+05:30 IST
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అయితే శాసనసభలో పార్టీ సభ్యుల లెక్కను చెప్పేటప్పుడు స్పీకర్ తడబడడం గమనార్హం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అయితే శాసనసభలో పార్టీ సభ్యుల లెక్కను చెప్పేటప్పుడు స్పీకర్ తడబడటం గమనార్హం. సభలో తనకు ఎదురైన అనుభవాలను చెబుతూ సభ్యుల సంఖ్యను స్పీకర్ తప్పుగా పలికారు. వైసీపీ సభ్యుల సంఖ్యను 151గా పేర్కొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం.. టీడీపీ సభ్యుల సంఖ్యను తప్పుగా చెప్పారు. టీడీపీ సభ్యుల సంఖ్యను కేవలం 2గా చెప్పారు. జనసేన ఒకటి, ఖాళీగా ఉన్న స్థానాల సంఖ్యను ఒకటిగా పేర్కొన్న స్పీకర్ మొత్తం సభ్యులగా సంఖ్యను 175గా తెలిపారు.
గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు (Speaker Tammineni Seetharam) టీడీపీ , వైసీపీ ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై జాబ్ క్యాలెండర్‌పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గందనగోళ పరిస్థితుల మధ్యనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుకు సవరణలను ప్రతిపాదించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.