Share News

Lokesh: జగన్ కేబినెట్ చెత్త కేబినెట్.. ఏపీ మంత్రులపై లోకేష్ ఫైర్

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:41 PM

Andhrapradesh: వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. గురువారం రాజాం శంఖారావం సభలో యువనేత మాట్లాడుతూ... సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయన్నారు. దొంగ ఓట్లు నమోదు చేసే అధికారులు జైలుకు వెళ్తారని ఆనాడే చెప్పామని.. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు.

Lokesh: జగన్ కేబినెట్ చెత్త కేబినెట్.. ఏపీ మంత్రులపై లోకేష్ ఫైర్

శ్రీకాకుళం, ఫిబ్రవరి 15 : వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) విరుచుకుపడ్డారు. జగన్ (CM Jagan) కేబినెట్ చెత్త కేబినెట్ అని, మంత్రులకు వారి శాఖలే తెలియవని అన్నారు. ‘‘ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు ఆర్థిక శాఖ మంత్రి. మైన్స్ మింగేసేవాడు, పాపాల పెద్దిరెడ్డి గనుల శాఖకు మంత్రి. గొనె సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప గాడు సివిల్ సప్లై మంత్రి’’ అంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.

జగన్ పాలనలో రోడ్లు స్విమ్మింగ్ పూల్స్‌గా మారిపోయాయని, రోడ్లపై ఈత కొట్టాలని ఎద్దేవా చేశారు. ‘‘మా నమ్మకం నువ్వే’’ అంటూ రోడ్ల పై 420 ఫొటోలు పెడుతున్నారన్నారు. సొంత తల్లి, చెల్లె జగన్‌ను నమ్మడం లేదని.. మరి జనం ఎలా జగన్‌ను నమ్ముతారని లోకేశ్ ప్రశ్నించారు. సొంత అమ్మా, చెల్లికి న్యాయం చేయలేనోడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. సొంత చెల్లిపై పేటీఎం కుక్కలను వదులుతున్నారంటూ లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం రాజాం శంఖారావం సభలో యువనేత మాట్లాడారు. సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లు నమోదు చేసే అధికారులు జైలుకు వెళ్తారని ఆనాడే చెప్పామని లోకేశ్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులను వదిలిపెట్టబోమని ఆయన పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులను శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ‘‘నాది అంబేద్కర్ రాజ్యాంగం.. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం’’ అంటూ వ్యాఖ్యానించారు.


జగన్ పెద్ద కట్టింగ్ మాస్టర్..

జగన్ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు అని.. మందు, ఇసుక, గ్యాస్, నిత్యావసరాలపైనా బాదుడే బాదుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ పెద్ద కటింగ్ మాస్టర్ అని వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్‌తో అన్ని వర్గాలకూ న్యాయం చేస్తామన్నారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని అన్నారు. మూడు రాజధానులు అన్నారని... మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను మూడు కుటుంబాలు దోచుకుంటున్నాయన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామన్నారు.

దమ్ముంటే రా.. అరెస్ట్ చేసుకో...

‘‘జగన్‌కు ఒక జబ్బు ఉందని.. నిజం చెబితే తల పగిలిపోతుంది.. అందుకే ఊరికి ఒక అబద్ధం చెబుతాడు’’ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీని గెలిపించండి... ప్రతి ఏకరాకూ నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రాజాం నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. పాలవలస విక్రాంత్, చిన్న సీను, స్థానిక ఎమ్మెల్యే ఇసుక దోచేస్తున్నారన్నారు. కష్టాల్లో పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచారన్నారు. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు... ఓ అన్నగా అండగా నిలబడ్డారన్నారు. పవన్, చంద్రబాబు కలిసి సైకో జగన్‌ను తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. కార్యకర్తలే టీడీపీ బలమన్నారు. వారికోసం ఎంత చేసినా తక్కువే అని చెప్పుకొచ్చారు. ఎర్ర బుక్ చూస్తే వైసీపీ నేతలకు ఉచ్చ పోసుకుంటున్నారన్నారు. తప్పు చేయకపోతే ఎందుకు భయమని అడిగారు. ‘‘రెడ్ బుక్ చూసి నాపై కేసు పెట్టారు. భయం నా బ్లడ్ లో లేదు. దమ్ముంటే రా జగన్ ప్రజల మధ్యనే ఉన్నా... అరెస్ట్ చేసుకో. నేను పరదాల చాటున పర్యటించే నాయకుని కాదు’’ అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 15 , 2024 | 01:01 PM