Sujana Chowdary: వైసీపీలోకి వెళ్లిన తర్వాత దిగజారి మాట్లాడుతున్న కేశినేని నాని
ABN , Publish Date - Apr 01 , 2024 | 05:47 PM
ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) వైసీపీ(YSRCP)లోకి వెళ్లిన తర్వాత మరీ తన స్థాయికి దిగజార్చుకుని మాట్లాడుతున్నారని విజయవాడ పశ్చిమ బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి(Sujana Chowdary) అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలపై సుజనా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని స్థాయికి దిగిజారి తాను మాట్లాడలేనని అన్నారు.
విజయవాడ: ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) వైసీపీ (YCP) లోకి వెళ్లిన తర్వాత మరీ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని విజయవాడ పశ్చిమ బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి(Sujana Chowdary) అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలపై సుజనా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని స్థాయికి తాను దిగిజారి మాట్లాడలేనని అన్నారు. పదేళ్లు కేశినేని నానితో కలిసి పని చేశానని.. అప్పుడు బాగానే ఉండేవారని.. ఇప్పుడేందుకు ఇలా మాట్లాడుతున్నారో ఆయన్నే అడగాలని అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను ధనికుడిగానే పుట్టానని... తాను ధనికుడినినని ఇప్పుడే నానికీ తెలిసిందా అని ఎద్దేవా చేశారు. ధనికులు అయితే ప్రజలకు సేవ చేయరా.. ప్రజల్లో కలవరా అని ప్రశ్నించారు. ఆయన మాట్లాడినట్లు తనకు నీచంగా మాట్లాడటం రాదన్నారు. తాను విజయవాడ వాసినే.. స్థానికేతరుడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. విజయవాడలో ఉన్న వారంతా ఇక్కడి వారేనా అని ప్రశ్నించారు. కొంతమంది నేతలు చాలా దిగజారి మాట్లాడుతున్నారని.. వారిపై సానుభూతి వ్యక్తం చేయడం తప్ప తానేమీ చేయలేనని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి రోడ్డూ తనకు తెలుసునని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా తనకు ఇక్కడ సీటు ఇచ్చారని చెప్పారు. జనసేన నేత పోతిన మహేష్‌కు టికెట్ రాకపోవడంతో కొంత ఆవేదన ఉండవచ్చని అన్నారు. ఆయనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారని చెప్పారు. తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి రాబోయే ఎన్నికల్లో విజయం కోసం పోతిన మహేష్ కూడా పని చేస్తారని తెలిపారు. కూటమి నేతల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు.
TDP: పెన్షన్ల అంశం.. సీఎస్‌తో టీడీపీ నేతల బృందం భేటీ
అందరం కలిసి పని చేస్తామని.. విజయం సాధిస్తామన్నారు. తాను దరఖాస్తు చేయకుండానే.. కూటమి తనను ఎంపిక చేసిందని తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కూటమి ముఖ్య నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేస్తానని.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చెస్తానని చెప్పారు. రాజకీయాల్లో గాలి ఏ విధంగా ఉంటే ఆ విధంగానే పని చేయాలని... వ్యతిరేక మార్గంలో చేయలేం కదా అని అన్నారు. తనపై నిందలు వేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తన పని తీరేంటో ప్రజలు త్వరలోనే చూస్తారన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తనకు పోటీ చేసే అవకాశం గతంలో కూడా రాలేదని చెప్పారు. ఇప్పుడు విజయవాడ వంటి నగరంలో రావడం తన అదృష్టమని తెలిపారు. ఒక ఎమ్మెల్యే ఎంత మంచి పని చేయొచ్చో చేసి చూపిస్తానని అన్నారు. సేవ చేసి మంచి ఎమ్మెల్యేగా ప్రజల్లో స్థానం సంపాదించుకుంటానని సుజనా చౌదరి చెప్పారు.
Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి