TDP Vs YSP: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఏకిపారేసిన దేవినేని ఉమా
ABN , Publish Date - Jan 19 , 2024 | 03:20 PM
Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానిపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఒక బడుద్దాయి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. గుడివాడలో ‘‘రా కదలిరా’’ బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందన్నారు. 5 వేల కుర్చీల కన్నా ఎక్కువ ఉంటే గుడివాడ వదిలిపెట్టి పారిపోతాను అని గుట్కా, క్యాసినో, గుండాట, సన్నాసి నాని మాట్లాడుతున్నారని టీడీపీ నేత దుయ్యబట్టారు.
ఎన్టీఆర్ జిల్లా, జనవరి 20: వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానిపై (YCP MLA Kodali Nani) టీడీపీ నేత దేవినేని ఉమా (TDP Leader Devineni Uma) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఒక బడుద్దాయి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుడివాడలో ‘‘రా కదలిరా’’ బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందన్నారు. 5 వేల కుర్చీల కన్నా ఎక్కువ ఉంటే గుడివాడ వదిలిపెట్టి పారిపోతాను అని గుట్కా, క్యాసినో, గుండాట, సన్నాసి నాని మాట్లాడుతున్నారని టీడీపీ నేత దుయ్యబట్టారు.
అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే నీక్కూడా...
‘‘కృష్ణా జిల్లా పరువు ప్రతిష్టలు తీశావు దరిద్రుడా! ఏ రాష్ట్రం వెళ్ళినా ఆ బూతులోడు మీ జిల్లా వాడ అని అడుగుతున్నారు. ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఎక్కడున్నావ్ రా దరిద్రుడా మా దగ్గరే ఉన్నావు కదరా. ఫినాయిల్ పెట్టి కడిగితే డ్రైనేజీ బాగుపడుతుందేమో కానీ కొడాలి నాని నోరు బాగుపడదు. బుద్దా వెంకన్న ఇంజెక్షన్ పంపించాడు వాటిని బొడ్డు చుట్టూ పొడిపించుకో. ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత మా అందరి చుట్టూ తిరిగి మా బూట్లు నాకాడు .. గుడివాడ నుంచి బొంగులు, తాటాకులు వేసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పందిరి వేశాడు. నీది ఒక బతుకేనా.. నీది ఒక జీవితమేనా? నువ్వు దోచుకున్న అవినీతి డబ్బులను కాపాడుకోవడం కోసం ఈ బూతు మాటలు మాట్లాడుతున్నావ్ ఖబడ్దార్. నిన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా.. అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి గుడివాడ సెంటర్లో నీకు ప్రజలు పట్టిస్తారు. 2024 రాగానే మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది బ్యాండ్ మేళం సెట్ ప్రజలు పెడతారు. పోలీసులను పెట్టుకొని మా నాయకులు రాకుండా ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర నాటకాలు ఆడతావా?’’ అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...