Pattabhi: కచ్చితంగా సిట్ అధికారులు బాధ్యత వహించాల్సిందే....
ABN , Publish Date - Apr 08 , 2024 | 04:30 PM
Andhrapradesh: సిట్ కార్యాలయంలో దగ్ధం చేసింది హెరిటేజ్ డాక్యుమెంట్లు కాదని.. వేస్ట్ పేపర్స్‌ను దగ్ధం చేశామంటూ సిట్ అధికారులు ఇచ్చిన వివరణపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్ అధికారులు ఇచ్చిన వివరణకు ఎటువంటి పొంతన లేదన్నారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కచ్చితంగా దీనికి సిట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
అమరావతి, ఏప్రిల్ 8: సిట్ కార్యాలయంలో దగ్ధం చేసింది హెరిటేజ్ డాక్యుమెంట్లు (Heritage Documents) కాదని.. వేస్ట్ పేపర్స్‌ను దగ్ధం చేశామంటూ సిట్ అధికారులు ఇచ్చిన వివరణపై టీడీపీ నేత పట్టాభి (TDP Leader Pattabhi) మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్ అధికారులు ఇచ్చిన వివరణకు ఎటువంటి పొంతన లేదన్నారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కచ్చితంగా దీనికి సిట్ అధికారులు (SIT Officers) బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎలక్షన్ కమిషన్‌ను కూడా ఈ రోజు సాయంత్రం కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. డాక్యుమెంట్ దగ్ధంపై సమగ్ర విచారణ జరపాలని ఎలక్షన్ కమిషన్‌ను (Election Commission) కోరతామన్నారు.
CID: ‘అవి హెరిటేజ్ డాక్యుమెంట్లు కావు’.. సీఐడీ దిద్దుబాటు చర్యలు
సచివాలయంలో ఉన్న ఫైల్స్ కూడా మయాం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సచివాలయంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభత్వ కార్యాలయలు వద్ద భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిట్ అధికారులు చేసిన తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడానికే మరో తప్పు చేశారన్నారు. అసలు డాక్యుమెంట్స్‌ను తగల పెట్టాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. ముఖ్యమైన డాక్యుమెంట్స్ అని కూడా కేసు ముగిసే వరకు అత్యంత భద్రంగా ఉంచాల్సిన బాధ్యత సిట్ అధికారులదే అని అన్నారు. హెరిటేజ్ అని స్పష్టంగా పేరు కనపడుతున్న ప్రింట్ సరిగా రాలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హెరిటేజ్ సంస్థకు చెందిన కాఫీలు మాత్రమే ఫోటో స్టార్ట్ మెషిన్‌లో ఇరుక్కుపోయాయా అంటూ పట్టాభి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి...
Breaking News: సీఎం రేవంత్ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!
PM Modi: రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ కూటమి కన్నెర్ర.. ప్రధాని మోదీ
మరిన్ని ఏపీ వార్తల కోసం...