Share News

Somireddy: ఓటమి ఫ్రస్ట్రేషన్‌తోనే జర్నలిస్టులపై దాడులు..

ABN , Publish Date - Feb 19 , 2024 | 10:55 AM

Andhrapradesh: అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ కృష్ణపై దాడి వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతల్లో ఓటమి భయంతో కూడిన ఫ్రస్ట్రేషన్‌ పీక్‌కు చేరిందన్నారు.

Somireddy: ఓటమి ఫ్రస్ట్రేషన్‌తోనే జర్నలిస్టులపై దాడులు..

అమరావతి, ఫిబ్రవరి 19: అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ కృష్ణపై దాడి వైసీపీ (YCP) అరాచకాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Former Minister Somireddy Chandramohan Reddy) మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతల్లో ఓటమి భయంతో కూడిన ఫ్రస్ట్రేషన్‌ పీక్‌కు చేరిందన్నారు. అందులో భాగమే మొన్న అమరావతిలో ఈనాడు రిపోర్టర్‌పై దాడికి తెగబడ్డారని.. నిన్న అనంతపురంలో పోలీసుల సమక్షంలోనే ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌ను విచక్షణరహితంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టు ఫొటోలు తీస్తుంటే వైసీపీ నేతలకు అంత ఉలుకెందుకో అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం అంటే పూర్తిగా లెక్కలేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపైనా దారుణాలకు దిగుతుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడిదన్నారు. పత్రికలన్నీ సాక్షిలాగా అబద్ధాలు రాసుకుంటూ భజన చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. సాక్షి వార్తలు రాయడం ఎప్పుడో మరిచిపోయిందని... ఆ పత్రిక ఉండేది ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలకు ఫేక్ కౌంటర్లు రాసుకోవడం కోసమే అని వ్యాఖ్యలు చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 19 , 2024 | 10:57 AM