Tenali: తెనాలి సీటు పై టీడీపీ - జనసేన మద్య వార్
ABN , Publish Date - Jan 16 , 2024 | 04:19 PM
రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీడీపీ-జనసేన కూటమికి కొత్త చిక్కులు వస్తున్నాయి. సీట్ల కేటాయింపుపై
రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీడీపీ-జనసేన కూటమికి కొత్త చిక్కులు వస్తున్నాయి. సీట్ల కేటాయింపుపై ఎలాంటి ప్రకటనలు రాకున్నా నేతల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెనాలి టికెట్ ను ఆలపాటి రాజాకే కేటాయించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెనాలి సీటును జనసేనకు ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆలపాటి రాజాతో సమావేశమయ్యారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్న ఆలపాటి.. తొందరపడవద్దని పార్టీ నేతలకు సూచించారు.