Share News

TDP Agent Buri Seshagiri Rao: పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:18 AM

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ పోలింగ్‌ ఎజెంట్‌ నం బూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన రెండు పిటిషన్లు దాఖలు చేశారు

TDP Agent Buri Seshagiri Rao: పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది

  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితుడు శేషగిరిరావు

న్యూఢిల్లీ, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ పోలింగ్‌ ఎజెంట్‌ నం బూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో 6 వరకు రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఒక పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని, తనపై ఆయన వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు.

రామకృష్ణారెడ్డిని ఆరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించాలని కోరారు. కౌంటింగ్‌ రోజున కూడా పిన్నెల్లి హింసకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేసి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ అంశాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చిందని శేషగిరిరావు పేర్కొన్నారు. పిన్నెల్లి అరెస్టు మినహాయింపును రద్దు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు కాగా, ఈ రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.

Updated Date - Jun 02 , 2024 | 07:09 AM