Andhra Pradesh: ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీలు..
ABN , Publish Date - Feb 27 , 2024 | 02:34 PM
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారో.. ఇప్పుడు చూద్దాం.. పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ గా బి.విజయసారధి, రేపల్లెకు బీఆర్ఎస్ శేషాద్రి, నిడదవోలుకు టి.రాంభూపాల్ రెడ్డి, ఆదోనికి కే.రామచంద్రారెడ్డి, ప్రొద్దుటూరుకు జి.రఘునాధ రెడ్డి, బాపట్లకు బి.శ్రీకాంత్, అద్దంకి మున్సిపల్ కమిషనర్ గా ఎం.సత్యనారాయణ, కనిగిరికి టీవీ.రంగారావు, ఆమదాలవలసకు జి.రవి, చీరాలకు పి.సింహాచలం మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు.
పార్వతీపురానికి కోన శ్రీనివాస్, శ్రీకాళహస్తికి ఆర్.రాంబాబు, జంగారెడ్డిగూడెంకు ఎం.రమేష్ బాబు, వెంకటగిరికి ఎస్.అబ్దుల్ రషీద్, పెడనకు బి.వెంకట రామయ్య, తాడిపత్రికి ఎం. రామ్మోహన్, నరసరావుపేటకు సి.రవిచంద్రారెడ్డి, ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ అసిస్టెంట్ కమీషనర్ వి.రవీంద్ర బదిలీ అయ్యారు. మార్కాపురానికి ఇ.కిరణ్, రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ గా పి కిషోర్, నందికొట్కూరుకు టి.సుధాకర్ రెడ్డిలను బదలీ చేస్తూ స్పెల్ ఛీప్ సెక్రటరీ వై శ్రీలక్షి ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.