Share News

Chittoor: టమోటా తెచ్చిన తంటా.. 250 కిలోమీటర్లు వెంటాడిన ముఠా..!

ABN , Publish Date - Oct 08 , 2024 | 11:31 AM

టమోటా ధర రోజురోజుకీ పెరుగుతోంది. కొన్ని చోట్ల వంద రూపాయలు పలుకుతోంది. మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువవుతోంది. పంటసాగు చేసిన రైతులకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. టమోటా దిగుబడిని మార్కెట్‌కు తీసుకెళ్తే.. రూ. లక్షలతో రైతులు, వ్యాపారులు తిరిగొస్తున్నారు. ఇప్పుడిదే రైతులకు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది.

Chittoor: టమోటా తెచ్చిన తంటా.. 250 కిలోమీటర్లు వెంటాడిన ముఠా..!
Robbery

Sathyasai District News: టమోటా ధర రోజురోజుకీ పెరుగుతోంది. కొన్ని చోట్ల వంద రూపాయలు పలుకుతోంది. మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువవుతోంది. పంటసాగు చేసిన రైతులకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. టమోటా దిగుబడిని మార్కెట్‌కు తీసుకెళ్తే.. రూ. లక్షలతో రైతులు, వ్యాపారులు తిరిగొస్తున్నారు. ఇప్పుడిదే రైతులకు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. ధర పెరుగుదలే దోపిడీకి కారణమైంది. టమోటాలు విక్రయించి వస్తున్న ఓ వ్యక్తి వ్యాన్‌ను దొంగల ముఠా వెంటాడింది. ఏకంగా 250 కిలోమీటర్లు దూరం వెంబడించి మరీ దోపిడీ చేసింది.


కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములు బాగల్‌కు చెందిన వ్యాన్‌లో టమోటాల లోడ్‌తో డ్రైవర్ నయాజ్ హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ టమోటాలు విక్రయించి, తిరుగు ప్రయాణమయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక కర్నూలు వద్ద టీ కోసం వ్యాన్‌ను ఆపాడు. అక్కడ ఓ ముఠా గమనించింది. టమోటా విక్రయించి వస్తున్న విషయం తెలుసుకుంది. పెద్ద ఎత్తున డబ్బు ఉంటుందని భావించి కారులో వెంటబడ్డారు. వ్యాన్ ఎక్కడా ఆపకుండా వచ్చేసింది. సోమందేపల్లి సమీపంలోకి రాగానే కారును.. వ్యాను అడ్డంగా వచ్చి ఆపారు. వ్యాన్ నిలపగానే డ్రైవర్ నయాజ్‌ను బెదిరించి సెల్ ఫోన్ లాక్కున్నారు. తరువాత అతడివద్దనున్న టమోటాల సొమ్ము రూ.5 లక్షల నగదును అపహరించుకెళ్లారు. దీంతో బాధితుడు సోమందేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.


Also Read:

మళ్లీ చేస్తే...‌‌ వైసీపీ భూస్థాపితం ఖాయం

ఆలయాలకు మదర్‌డెయిరీ నెయ్యి, పాలు అందజేస్తాం..

రెండు రాష్ట్రాల్లో లీడ్‌లో ఉన్న ప్రముఖులు వీరే

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 08 , 2024 | 11:31 AM