Varlaramaiah: అందుకే రాయి దాడి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య విసుర్లు
ABN , Publish Date - Apr 14 , 2024 | 03:29 PM
జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా, ప్రజలను భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ (CM Jagan) తాపత్రయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు జగన్‌ని గద్దె దించుతున్నారని ఆయనకు తెలుస్తోందని... అందుకే ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు.
అమరావతి: జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా, ప్రజలను భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ (CM Jagan) తాపత్రయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు జగన్‌ని గద్దె దించుతున్నారని ఆయనకు తెలుస్తోందని... అందుకే ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు. ఐదేళ్ల క్రితం కోడికత్తి డ్రామా ఆడారని.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు ఈ రాయి డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
AP Election 2024: సీఎంపై రాయి విసిరిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఏం కేసు పెట్టారంటే?
వేలాదిమంది పోలీసులుండగా ఒక చిన్న రాయితో ముఖ్యమంత్రిని హత్య చేయడానికి ప్రయత్నించే సాహసం ఎవరైనా చేస్తారా? అని ప్రశ్నించారు. దాడి చేస్తే ఎక్కడైనా రాయి తగిలి కింద పడుతుంది.. కానీ ఇక్కడ పక్కవాడికి కూడా తగలడం విచిత్రంగా ఉందని దెప్పిపొడిచారు. వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ తన కన్నును జాగ్రత్తగా చూసుకోవాలని.. ఈ డ్రామాలో కన్ను పోయే ప్రమాదముందన్నారు. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందని అవుతు శ్రీధర్ రెడ్డి అనే నేరస్తుడు ట్వీట్ చేస్తే పోలీసులు పట్టించుకోరా! అని నిలదీశారు.
Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..
అతను చెప్పినట్లే జగన్‌పై ‘‘హత్యాయత్నం’’ అనే సంచలనాత్మకమైన డ్రామా జరిగిందని సెటైర్లు వేశారు. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ నేతలు అంటగట్టడం దుర్మార్గమన్నారు. ఈ దాడి జరిగిన 10 నిమిషాల్లో చంద్రబాబుని ఉద్దేశించిన ఫ్లకార్డులతో ధర్నా చేశారని ఇది వైసీపీ డ్రామా కాదా? అని ప్రశ్నించారు. రాయి డ్రామా ఆడబోతున్నారని జగన్ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందికి కూడా ముందే తెలుసునని... అందుకే రాయి వచ్చేటప్పుడు అందరూ కూర్చున్నారని చెప్పారు. ఒక అమాయకుడిని ఈ కేసులో ఇరికించి.. అతన్ని కూడా కోడికత్తి శీనులా జైల్లో మగ్గబెడతారేమో? అని ఎద్దేవా చేశారు.
TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి
వెంటనే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని అన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తేనే జగన్, వారి బృందం ఆడిన ‘రాయితో హత్యాయత్నం’ అనే డ్రామా బయటపడుతుందన్నారు. ముఖ్యమంత్రి ఒక్కడినే బస్సు పైన నిలబెట్టి చీకట్లో సెక్యురిటీ ఆఫీసర్లు ఎవరైనా కూర్చుంటారా? ఇదంతా డ్రామా కాదా? అని నిలదీశారు. షర్మిల కూడా వైసీపీ మూకల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆనాడు బాబాయినే చంపేశారని... ఇప్పుడు షర్మిలకు కూడా హాని తలపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంకెంతకాలం ప్రజలను మభ్య పెడతారు, మోసం చేస్తారని ప్రశ్నించారు. జగన్ అధికార దాహానికి కోడికత్తి శీను బలయ్యాడని.. ఇప్పుడు రాయి కేసులో మరో అమాయకుడు బలికాబోతున్న విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఇది హత్యాయత్నం కాదు, ముఖ్యమంత్రిని గాయపరచాలన్న ఉద్దేశం ఎవరికి లేదని.. ఇది కేవలం అధికారం కోసం జగన్ ఆడిన డ్రామా మాత్రమేనని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
TDP: జగన్ ఓడి.. చంద్రబాబు సీఎం అవుతారు: రఘురామ
మరిన్ని ఏపీ వార్తల కోసం...