Share News

Venkaiah Naidu : వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Aug 16 , 2024 | 06:18 AM

స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్న వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువతరం భాగస్వామి కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

Venkaiah Naidu : వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి

  • స్వాతంత్య్ర వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

వెంకటాచలం, ఆగస్టు 15: స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్న వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువతరం భాగస్వామి కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం సరస్వతి నగర్‌ వద్ద ఉన్న అక్షర విద్యాలయంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్షర, స్వర్ణభారతి విద్యామందిర్‌ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణాలను ఆర్పించిన సమరయోధుల స్మృతికి నివాళ్లు ఆర్పించిన ఆయన, వారి కలలకు ప్రతిరూపమైన నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటి మీద జెండాను ఎగరేసి ప్రజలంతా దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్వర్ణభారత్‌ ట్రస్టీ నాగారెడ్డి హరికుమార్‌రెడ్డి, అక్షర విద్యాలయం ప్రిన్సిపాల్‌ కుముదా పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 06:45 AM