Victim's Father : నేనెవరిపైనా కేసు పెట్టలేదు
ABN , Publish Date - Dec 02 , 2024 | 05:36 AM
తామెవరి మీదా కేసు పెట్టలేదని, తన కూతురిపై దాడి జరిగితే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తామే పిలిచామని లైంగికదాడి ఘటనపై బాలిక తండ్రి స్పష్టం చేశారు.
ఎర్రావారిపాలెం బాలిక కేసుపై తండ్రి ప్రకటన
చెవిరెడ్డిపై పోక్సో కేసులో సంచలన మలుపు
తిరుపతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): తామెవరి మీదా కేసు పెట్టలేదని, తన కూతురిపై దాడి జరిగితే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తామే పిలిచామని లైంగికదాడి ఘటనపై బాలిక తండ్రి స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు అవాస్తవ ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారంటూ బాధితురాలి తండ్రి ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అయితే వారం రోజుల తర్వాత బాధిత బాలిక తల్లిదండ్రులు వైసీపీ నేతలతో కలసి మీడియా ముందుకొచ్చి చెవిరెడ్డిపై తాము కేసు పెట్టలేదని ప్రకటించారు. బాలిక తండ్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం పెట్టమని చెబితే పెట్టానని చెప్పారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందని సహాయం చేయడానికి వచ్చినవారిపై కేసు ఎలా పెడతానని ప్రశ్నించారు. భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో పోలీసులు తప్పు చేశారని తేలిపోయిందని అన్నారు.