AP Police: ముంబయి నటి కుటుంబంపై వేధింపుల ఘటన.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 28 , 2024 | 08:44 PM
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు, ఎన్‌డిపిఎస్ కేసులతో పాటు ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు, ఎన్‌డిపిఎస్ కేసులతో పాటు ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సమీక్షా సమావేశం తరువాత ఆ వివరాలను డీజీపీ వివరించారు. రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. టాస్క్‌ఫోర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సాగు దశలోనే గంజాయి నివారణకు చర్యలు చేపట్టామని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాలు ఇటీవల కాలంలో పెరిగాయన్నారు. గోల్డెన్ అవర్‌లో బాధితులు పోలీసులకు సమాచారం ఇస్తే బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసి నష్టపోకుండా చూడటం సాధ్యమవుతుందన్నారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక సైబర్ క్రైమ్ టీమ్‌లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. కేసుల దర్యాప్తులో పారదర్శకత కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీజీపీ వివరించారు.
AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను
గణేష్ మండపాలకు అనుమతులు..
రాష్ట్రంలో గణేష్ మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. ATM దోపిడీలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ప్రమేయం ఉన్నట్లు తేలిందని.. ఇటీవల అనంతపురంలో రెండు బృందాలను పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి నియంత్రణ కోసం డ్రోన్ లు, ప్రత్యేక నిఘా కెమెరాలు, స్నిఫర్ డాగ్స్‌ను ఉపయోగిస్తున్నామని.. గంజాయి నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు శాఖలో నిధుల కొరత కారణంగా కొన్ని కీలక విభాగాలు మూలన పడ్డాయని, ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరాల ఎఎంసిలకు నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయని డీజీపీ తెలిపారు. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ గత మూడేళ్లలో విడుదల కాలేదని, దాని కారణంగా సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తూ ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారని డీజీపీ తెలిపారు.
JC Asmith Reddy: కొందరు పోలీసుల తీరులో మార్పు రాలేదు..
తాడిపత్రి, ముంబయి నటి ఘటనలపై..
తాడిపత్రి ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. తాము ప్రజలకు జవాబుదారీగా ఉంటామని స్పష్టం చేశారు. నాయకులు, పార్టీలు, పోలీసు సిబ్బంది సహా ఎవరు తప్పు చేసినా చర్యలు ఉంటాయన్నారు. తమకు కొన్ని నిబంధనలు ఉన్నాయని, యూనిఫామ్ వేసుకున్నా తర్వాత ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని డీజీపీ చెప్పారు. సీఐ ఇప్పటికే క్షమాపణ చెప్పిన వీడియో బయటకు వచ్చిందని, ఆఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు.
AP Government: పత్తి రైతుకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
మావోయిస్టులపై..
ఏవోబీలో మావోయిస్టుల ప్రబావం బాగా తగ్గిందని డీజీపీ తెలిపారు. మావోయిస్టులకు గంజాయి వ్యాపారులు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. మావోయిస్టుల కదలికలు తగ్గినా.. మూలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గంజాయి కింగ్‌పిన్స్‌ను కట్టడి చేయడమే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా ఉంటుదన్నారు. గంజాయి ఓడిశా నుంచి వస్తుంటే చెడ్డ పేరు రాష్ట్రానికి వస్తోందన్నారు. గంజాయికి సంబంధించి ఎలాంటి తప్పులు చేసినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నైజీరియన్ సైబర్ ముఠాలు తెలివిమీరాయని, ప్రాంతీయ భాషల్లో మాట్లాడే వాళ్ళను ఏర్పాటు చేసుకుని కాల్ సెంటర్లు నడుపుతూ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
YS Sharmila: ఏపీలో కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
ఇతర కేసుల్లో..
రాష్ట్రంలోని పలు కేసులకు సంబంధించి డీజీపీ మాట్లాడుతూ.. మదనపల్లి ఫైళ్ళను దగ్ధం కేసులో దర్యాప్తు జరుగుతోందన్నారు. నేరం ఎవరు చేశారో తెలుసని.. వాళ్ళ వెనుక వున్న వాళ్ళను గుర్తించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విశాఖపట్టణం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసుకు సంబంధించిన పునర్విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ముంబై నటి కుటుంబంపై వేధింపులు ఘటనలో కొందరు అధికారుల ప్రమేయం ఉందన్న అంశంపై విచారణ జరుగుతోందని డీజీపీ తెలిపారు. తప్పు ఎవరూ చేసినా, ఏ స్థాయి వాళ్లు చేసినా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News