Share News

AP Governor Abdul Nazeer: దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలి

ABN , Publish Date - Sep 19 , 2024 | 10:50 PM

దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏయూ మెరైన్ గ్రౌండ్స్‌లో జాతీయ స్థాయి దివ్య కళా మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ఈరోజు(గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు.

AP Governor Abdul Nazeer: దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలి

విశాఖపట్నం: దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏయూ మెరైన్ గ్రౌండ్స్‌లో జాతీయ స్థాయి దివ్య కళా మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ఈరోజు(గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు.


దివ్యాంగుల సంక్షేమం కోసం సహకరించిన సంస్థలను సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ... విశాఖపట్నంలో దివ్య కళా మేళాను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. దివ్యాంగులు అన్నిరంగాల్లో ముందు ఉన్నారని. చేయుత ఇచ్చివారికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. 20 రాష్ట్రాలు ఈ దివ్య కళా మేళాలో భాగస్వాములు అవుతున్నాయని వివరించారు. దివ్యాంగుల ఆర్టిఫిషల్ అవయవాలు పరికరాల తయారు కేంద్రాలు చక్కగా నడుస్తున్నాయని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.


దివ్యాంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి: మంత్రి వీరేంద్ర కుమార్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనస్సులో దివ్యాంగులకు చాలా ఉన్నత స్థానం ఉందని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ తెలిపారు. దివ్యాంగులకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. దివ్యాంగులకు పది జాతీయ విద్యా సంస్థలు ఉన్నాయని.. దివ్యాంగుల్లో మంచి సాంస్కృతిక ప్రతిభ ఉన్నవారు ఉన్నారని తెలిపారు. వారితో ఈ నెల 29న ముగింపు వేడుక నిర్వహిస్తున్నామని అన్నారు. భారత దేశ పారా ఒలంపిక్స్ బీజింగ్, జపాన్, ఫ్రాన్స్ ఒలంపిక్స్‌లో పతకాలు పెంచుకుంటూ పోయారని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు.


దివ్యాంగుల శక్తి అందరికి తెలిసింది: ఎంపీ శ్రీ భరత్

సాధారణ ఒలంపిక్స్‌లో 6 మెడల్స్ వస్తే, పారా ఒలంపిక్స్‌లో 29 మెడల్స్ భారత్‌కి వచ్చాయని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. అది భారతదేశంలో దివ్యాంగుల శక్తి అందరికి తెలిసేలా చేసిందని ఎంపీ శ్రీ భరత్ అన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 10:51 PM