Share News

Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:09 PM

విశాఖ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏమి లాయర్?... ఆయన ప్రెస్ మీట్ పెట్టీ భుజాలు తడుముకున్నారని.. ఆయిన తనపై ఊగుతూ మాట్లాడారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం విశాఖలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

 Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో
APCC Chief Sharmila

విశాఖ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) ఆయన ఏమి లాయర్?... ఆయన ప్రెస్ మీట్ పెట్టీ భుజాలు తడుముకున్నారని.. ఆయిన తనపై ఊగుతూ మాట్లాడారని ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం (Election Capmaign)లో భాగంగా ఆమె ఆదివారం విశాఖ (Visakha)లో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan).. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య క్విడ్ ప్రోకో (Quid Proquo) జరిగిందని ఆరోపించారు. వైఎస్‌ఆర్ (YSR)అంటే అభిమానం, గౌరవం ఉందని చెప్పిన పొన్నవోలు సుధాకర్ వైఎస్‌ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్ (FIR)లో‌ చేర్చాలని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారని ప్రశ్నించారు.


రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చినందుకు పొన్నవోలుకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పదవి జగన్ ఇచ్చారని షర్మిల ఆరోపించారు. జగన్ ఆదేశాలు మేరకే.. పొన్నవోలు అలా చేశారని అన్నారు. అత్యంత మేలు చేశారు కనుక జగన్ సిఎం అయిన వారంలోగా ఏఏజీ పదవి బహుమతిగా ఇచ్చారన్నారు. పొన్నవోలుకు టాలెంట్ ఎక్కడ ఉంది, స్వామి భక్తికి మెచ్చే ఆయనకు పదవి కట్టబెట్టారన్నారు. ఈ అంశాలు నాకు ముందు తెలియదని.. ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ కలిసినప్పుడు ఆయనే ఈ సీబీఐ కేసులో వైఎస్ ఆర్ పేరు పెట్టిన అంశం చెప్పారని షర్మిల తెలిపారు.


రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిస్థితులు మార్చారని, వారి తండ్రిని చంపిన వారిని కూడా క్షమించి విడిచిపెట్టారని.. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. హత్యలు చేసిన వారికే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. వివేక హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు కాదని.. సీబీఐ బయట పెట్టిన అంశాలు బట్టి మేము మాట్లాడుతున్నామన్నారు. జేడీ లక్ష్మీనారాయణ అప్పుడు మాటలకు ..ఇప్పుడు మాటలకు చాలా తేడా ఉందన్నారు. జేడీ ప్రస్తుతం ఒక పార్టీ అధినేత..కనుక ఆయన వ్యాఖ్యలు రాజకీయ నేపథ్యంలో ఉంటాయని షర్మిల వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్

హైదరాబాద్: ఓ పబ్‌లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు

అనంతపురం: ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి రౌడీయిజం

మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప

రాజీనామా లేఖతో రేవంత్‌ రెడ్డి రాలేదేం?

KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 28 , 2024 | 01:11 PM