Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌పై హైకోర్టులో విచారణ.. కేంద్రానికి కీలక ఆదేశాలు..!
ABN , Publish Date - Apr 03 , 2024 | 08:07 PM
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏ చట్ట ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీ కరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ..
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏ చట్ట ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశ్రాంత ఐపీఎస్ అధికారి వానగిరి లక్ష్మీనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిగింది. ప్రయివేటీకరణ నిర్ణయానికి ముందు పరిశ్రమలోని ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం, స్టేక్ హోల్డర్స్‌ను సంప్రదించారా అని హైకోర్టు కేంద్ర ప్రభుత్వ తరపు లాయర్‌ను కోర్టు ప్రశ్నించింది.
Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య
భూముల విక్రయం, తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. సొంత నిధులతో కొనుగోలు చేసిన భూమి మాత్రమే విక్రయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ తరపు లాయర్ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 24కి వాయిదా వేసింది.
మరోవైపు విచారణ సందర్భంగా ఆర్ఎఎన్ఎల్ తెలిపిన వివరాలను హైకోర్టు ధర్మాసనం రికార్డు చేసింది. అఫిడవిట్ వేసేందుకు కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాది కొంత సమయం కోరడంతో విచారణను న్యాయస్థానం ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..