AP Politics: ఓటమితో నిజం ఒప్పేసుకున్న బొత్స.. నిన్నటి వరకు ఓ మాట.. నేడు మరో మాట..
ABN , Publish Date - Jun 06 , 2024 | 02:00 PM
ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. ఓడిపోయిన ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరు మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమిపై స్పందించారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు.
ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. ఓడిపోయిన ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరు మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమిపై స్పందించారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ ఘోర ఓటమికి పార్టీ విధానాలే కారణమని ఒప్పుకున్నారు. అంటే జగన్ ఏకపక్ష నిర్ణయాలతో పాటు.. ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకపోవడం, ప్రతిపక్ష నాయకులను వేధించడం వంటి నిర్ణయాలే తమ ఓటమికి కారణమని బొత్స సత్యనారాయణ పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లైంది. వైసీపీ విధానాలు నచ్చకనే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన అందిచమని వైసీపీకి గతంలో అధికారం ఇస్తే.. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించడంతోనే వైసీపీ అభ్యర్థులను ఓడించారని మాజీ మంత్రి తెలిపారు. ఓటమికి పార్టీలో ఏ ఒక్కరినో నిందించలేమని.. పార్టీ విధానాలే కారణమన్నారు. మా పార్టీ కంటే కూటమి మెరుగైన పాలన అందిస్తుందని ప్రజలు ఆశించారని.. అందుకే టీడీపీ కూటమిని గెలిపించారని చెప్పారు. పార్టీని మరింతగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు ఓ స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అమలు కావాలని కోరుకుంటున్నామన్నారు.
అత్యధిక మెజార్టీతో చరిత్ర సృష్టించాం
బొత్స మాట మారిందా..!
ఎన్నికల ముందు వరకు వైసీపీ అధినేత జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో గొప్పదంటూ బొత్స సత్యనారాయణ సమర్థిస్తూ వచ్చారు. పార్టీలో కీలకనేతగా ఉన్న ఆయన జగన్ ప్రతి నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా అధినేత నిర్ణయంపై ఎటువంటి అభ్యంతరం చెప్పేవారు కాదు. జగన్ ఎంతో గొప్పగా పాలన అందిస్తున్నారని కొనియాడారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత బొత్స సత్యానారాయణ మాట మారిందనే విషయం స్పష్టమవుతోంది. ఓటమికి పార్టీ విధానాలే కారణమని పరోక్షంగా ఓటమి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణమంటూ చెప్పారు. దీంతో ఫలితాల తర్వాత బొత్స సత్యనారాయణ మాట మార్చారనే చర్చ జరుగుతోంది.
వైసీపీని వీడతారా..
బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల తర్వాత ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరతారా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకునిపోవడంతో.. ఆ పార్టీలో ఉండి రాజకీయాలు చేయలేమనే ఆలోచనలో బొత్స ఉన్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు నెలల తర్వాత తన అనుచరులతో చర్చించి కాంగ్రెస్‌లో చేరవచ్చనే చర్చ నడుస్తోంది. బొత్స రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది.
Janasena : ప్రతి ఓటూ బాధ్యత గుర్తుచేసేదే
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News