Share News

Chandrababu: మెడ్ టెక్ జోన్ గ్లోబల్ జోన్‌గా ఎదుగుతుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 11 , 2024 | 08:42 PM

మెడ్ టెక్ జోన్ గ్లోబల్ జోన్‌గా ఎదుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. మెడ్ టెక్ జోన్‌ ప్రతినిధులతో ఈరోజు(గురువారం) సమావేశం అయ్యారు.

Chandrababu: మెడ్ టెక్ జోన్ గ్లోబల్ జోన్‌గా ఎదుగుతుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Nara Chandrababu Naidu

విశాఖపట్నం: మెడ్ టెక్ జోన్ గ్లోబల్ జోన్‌గా ఎదుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. మెడ్ టెక్ జోన్‌ ప్రతినిధులతో ఈరోజు(గురువారం) సమావేశం అయ్యారు. స్టీల్ సిటీ, మెడికల్ సిటీ, భోగపురం విమానాశ్రయం అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. తన హార్ట్ టచింగ్ సిటీ ఇదని హుద్ హుద్ సమయంలో వారం రోజులు ఇక్కడే ఉన్నానని తెలిపారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. ఇక్కడ మూడు పార్టీల నాయకులు ఉన్నారని స్వర్ణయుగంలో అభివృద్ధి తథ్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.


శర్మ మెడ్‌టెక్‌ను చాలా బాగా అభివృద్ధి చేశారు

‘‘ఒక చిన్న ప్రయత్నం.. ఒక చరిత్రగా అవతరించింది. మెడి టెక్ సీఈఓ జితేందర్ శర్మను నా ప్రభుత్వంలో సలహాదారుగా బాధ్యత తీసుకోమని అడిగా. 28 కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. పబ్లిక్ హెల్త్‌లో మెడికల్ ఎక్విప్‌మెంట్ బాధ్యతతో కూడుకున్నది. ఆ బాధ్యతలను శర్మ సమర్థంగా నిర్వర్తించారు. ప్రభుత్వం సపోర్ట్ లేకుండా సంక్షోభాలను తట్టుకుంటూ మెడ్‌టెక్‌ను అభివృద్ధి చేశారు. 1999లో బయో టెక్నాలజీ పార్క్ , దాని కంటే ముందు ఐటీ ఉండేది. భారత్ బయోటెక్ ద్వారా ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి అవసరమైన వ్యాక్సిన్లను అందజేశారు. వ్యాక్సిన్ అందించి ప్రపంచాన్ని కాపాడారు. శర్మ 140 కంపెనీలు ఏర్పాటు చేశారు . మార్కెటింగ్, మ్యానిఫ్యాక్చరింగ్‌, మిగిలినవి అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. 10 వేల కోట్లు టర్నోవర్ 6 వేల ఉద్యోగులతో మెడికల్ హబ్‌గా మారింది. మంచి ఉత్పత్తులు అందిస్తున్నారు. దేశంలో 20 రాష్ట్రాల్లో ఈ ఉత్పత్తులు వినియోగంలో ఉన్నాయి.. కానీ ఏపీలో మాత్రం గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. ట్రిపుల్ ఐటీ చాలా కాలం క్రితం ప్రారంభించా.. ఇప్పుడు మంచి ఫలితాలు అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. 275 ఎకరాల విస్తీర్ణంలో మెడ్ టెక్‌ను అభివృద్ధి చేశారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 09:09 PM