Share News

Pawan Kalyan: ముడసర్లోవ పార్క్‌పై ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు.. పవన్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 13 , 2024 | 09:15 PM

ఏపీ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) దృష్టికి విశాఖలోని ముడసర్లోవ పార్క్ సమస్యను విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఎ.ఎస్. శర్మ తీసుకొచ్చారు.

Pawan Kalyan: ముడసర్లోవ పార్క్‌పై ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు.. పవన్ కీలక ఆదేశాలు
Pawan Kalyan

అమరావతి: ఏపీ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) దృష్టికి విశాఖలోని ముడసర్లోవ పార్క్ సమస్యను విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఎ.ఎస్. శర్మ తీసుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రికి శర్మ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పవన్ స్పందించి కీలక ఆదేశాాలు జారీ చేశారు. ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించేలా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించారు.


ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని వీటిని చేపట్టవద్దని పవన్ సూచించారు. నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని తెలిపారు. జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతోందని వచ్చిన వార్తలపై ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అలాంటి ప్రతిపాదనలు ఏం చేపట్టడం లేదని పవన్ కళ్యాణ్‌కు జీవీఎంసీ అధికారులు తెలిపారు.

Updated Date - Jul 13 , 2024 | 09:32 PM