Share News

Crime News: విశాఖలో నకిలీ పోలీసుల దందా

ABN , Publish Date - Mar 08 , 2024 | 08:38 AM

హైదరాబాద్: నగరంలో నకిలీ పోలీసుల దందా గుట్టు రట్టయింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు నకిలీ ఎస్ఐ హనుమంత రమేష్ , అతని ప్రియురాలు వల వేశారు.

Crime News: విశాఖలో నకిలీ పోలీసుల దందా

హైదరాబాద్: నగరంలో నకిలీ పోలీసుల (Fake police) దందా (Crime) గుట్టు రట్టయింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాలు (SI Jobs) ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు నకిలీ ఎస్ఐ (Fake SI) హనుమంత రమేష్ , అతని ప్రియురాలు వల వేశారు. రమేష్ అతని ప్రియురాలు కాకి దుస్తులతో నిరుద్యోగులకు నమ్మించినట్లు బాధితులు తెలిపారు. సుమారు 30 నుంచి 50 మంది బాధితుల నుంచి రూ. 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా.

కాగా నకిలీ ఎస్ఐ హనుమంత రమేష్‌కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. ప్రియురాలితో కలిసి పోలీస్ డిపార్టుమెంట్‌లో ఉద్యోగాలంటూ మోసానికి పాల్పడ్డారు. హనుమంతు రమేష్ అతని ప్రియురాలు విశాఖకు చెందిన వారు. బాధితుల ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను హైదరాబాదులో పట్టుకున్నారు. విశాఖ, పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 08 , 2024 | 11:11 AM