Share News

Amarnath: ఋషికొండపై టీడీపీ నేతల తప్పుడు ప్రచారం: గుడివాడ అమరనాథ్

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:15 PM

విశాఖ: ఋషికొండపై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ సొంత భవనాల్లా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు.

Amarnath: ఋషికొండపై టీడీపీ నేతల తప్పుడు ప్రచారం: గుడివాడ అమరనాథ్

విశాఖ: ఋషికొండ (Rishikonda)పై జగన్ (Jagan) నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ సొంత భవనాల్లా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ (Ex. Minister Gudivada Amarnath) అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivasarao) రుషికొండ భవనాలపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అమరనాథ్ సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించామని, ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.


రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంలో రుషికొండ భావనలను వినియోగించుకోవాలని, రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ మోహన్ రెడ్డి ఉండరని అమరనాథ్ అన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారని, ఆ కమిటీ నివేధిక ఇచ్చిన తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారని తెలిపారు. టీడీపీ నేతలు జగన్‌పై, ఆయన కుటంబంపై బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసునని అమరనాథ్ అన్నారు. హైదారాబాద్‌లో ఇల్లు నిర్మించుకునే సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్‌లో ఉండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండ పై శాశ్వత భవనాలు నిర్మించారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలన్నారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలని గుర్తించాలన్నారు. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేదని అమరనాథ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జపాన్‌ను వణికిస్తున్న బ్యాక్టీరియా..

రుణమాఫీ కటాఫ్ తేదీ ఖరారు..!

ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. (ఫోటో గ్యాలరీ)

ఆ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత..

అప్పుడు తగ్గారు..ఇప్పుడు నెగ్గారు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 17 , 2024 | 12:21 PM