Share News

BJP: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్

ABN , Publish Date - May 29 , 2024 | 01:03 PM

విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్ళలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టులపేరుతో భూ సంతర్పణ చేశారని.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలార్ సంస్ధలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని ఆరోపించారు.

BJP: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్

విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Govt.)పై బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ (Lanka Dinakar) తీవ్రస్థాయిలో విమర్ళలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టుల (Power project)పేరుతో భూ సంతర్పణ చేశారని.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ (Shiridi Sai Electricals), ఇండోసోలార్ (Indo solar) సంస్ధలకు భారీఎత్తున భూములు (Lands) కట్టబెట్టారని ఆరోపించారు. ఈ సందర్బంగా బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంవోయూ (MOU)లు చేసుకోకుండా జీవోలు ఇచ్చిన ఘనత జగన్ సర్కారుదేనని, తన అస్మదీయులకు భూసంతర్పణ చేస్తూ.. రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని డి పట్టాభూమలను బదలాయించుకున్నారని విమర్శించారు.


జూన్ 4న ఎన్డీఏ కూటమి (NDA Kutami) ప్రభుత్వం రాబోతోందని, భూములపేరుతో జరిగిన అవినీతి, అక్రమాలపై దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతామని లంకా దినకర్ అన్నారు. సీఎస్ తనయుడు పేరు మీదే భూ దోపిడీలు జరుగుతున్నాయని, సీఎం జగన్ 4 లక్షల ఎకరాల భూమిని అస్మదీయులకు కట్టబెట్టారని ఆరోపించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు క్విడ్ ప్రోకోతో భూములను కట్టబెట్టారన్నారు. ఏక్సస్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ ఆగడాలను కూడా ప్రశ్నించామని, దీనిపై ఈఆర్సీ అడ్డుకట్ట వేసిందన్నారు. కర్నూల్, అనంతపూర్, కడప జిల్లాల్లో 32 వేల ఎకరాలను షిరిడీసాయి, ఇండో సోలార్ కంపెనీలకు నామమాత్రపు ధరకు ధారాదత్తం చేశారని విమర్శించారు.


ఏమాత్రం అనుభవం లేని సంస్ధలతో ఎంవోయూలు ఎలా చేసుకున్నారు?.. రూ. 500 కోట్లు మించి టర్నోవర్ లేని సంస్ధలకు వేల కోట్ల భూమలను ఎలా కట్టబెడతారు?.. దీనిపై ఆడిట్ చేయాలని లంకా దినకర్ డిమాండ్ చేస్తున్నారు. ఇటు వంటి కంపెనీలు భూములు విలువ ఆధారంగా మూల్యాంకణం ఎక్కువగా చూపించి అంతర్జాతీయ విపణిలోకి ప్రవేసించే ప్రమాదం వుందన్నారు. అధిక పెట్టుబడులను ఆకర్షించే భారీ ఆర్ధిక మోసాలకు తెరలేపే ప్రమాదం వుందని, ప్రాజెక్టు అనుమతులకోసం చేసిన అకృత్యాలను రాబోయే ప్రభుత్వం నిగ్గుతేల్చాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్లు , పోల్స్ రాబోయే ఐదేళ్లకు అత్యధిక ధరలకు సరఫరా చేసే ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకున్నారని లంకా దినకర్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 29 , 2024 | 01:06 PM