Share News

KA Paul: సీఎం జగన్‌తో యుద్ధం ప్రకటిస్తున్నా..

ABN , Publish Date - Feb 14 , 2024 | 01:39 PM

విశాఖ: ‘నరేంద్రమోదీతో యుద్ధం-మన విశాఖ సిద్ధం’ అని ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నమ్మక ద్రోహంచేస్తున్నారని...ఆఖరికి తల్లి, చెల్లిని మోసం చేశారని ఆయన విమర్శించారు.

KA Paul:  సీఎం జగన్‌తో యుద్ధం ప్రకటిస్తున్నా..

విశాఖ: ‘నరేంద్రమోదీతో యుద్ధం-మన విశాఖ సిద్ధం’ అని ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నమ్మక ద్రోహంచేస్తున్నారని...ఆఖరికి తల్లి, చెల్లిని మోసం చేశారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ్టి నుంచి సీఎం జగన్‌తో తాను యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పారు. ఆనాడు షర్మిలా పాదయాత్ర చేయకపోతే... జగన్ అధికారంలోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు. జగన్, విజయ సాయి రెడ్డి జైల్‌కు వెళ్లాల్సిన నేతలని అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను కలిశానని.. తనకు గౌరవం ఇవ్వని నేతలు జగన్, చంద్రబాబు అని పాల్ పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్నికల ముందు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని వైఎస్ షర్మిలాకు తాను చెప్పానని కేఏ పాల్ అన్నారు. సర్వ నాశనం చేసిన జగన్ కావాలా...సర్వ అభివృద్ధి చేసే తాను కావాలో.. ప్రజలు ఆలోచించాలన్నారు. మేము శాంతియుతంగా యుద్ధం చేస్తామన్నారు. బొత్స ఝాన్సీ, జీవీఎల్ విశాఖ ఎంపీగా పోటీ చేయవద్దని కోరుతున్నానన్నారు. ఝాన్సీ ఎంపీగా పోటీ చేస్తే...బొత్స కుటుంబం అవినీతి చిట్టా విప్పుతానన్నారు. జనసేన నుంచి టికెట్ రాని అభ్యర్థులు అంతా ప్రజాశాంతి పార్టీలో కలుస్తారన్నారు. విశాఖను ఇంటర్‌నేషనల్ సిటీగా అభివృద్ధి చేస్తానని, తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని కోరారు. 90 రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తానని.. ఏపీలో అన్ని స్థానాల నుంచి ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ స్పష్టం చేశారు.

Updated Date - Feb 14 , 2024 | 01:39 PM