Share News

Lokesh: పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానున్న లోకేష్

ABN , Publish Date - Oct 18 , 2024 | 09:18 AM

నారా లోకేష్ శుక్రవారం విశాఖలో కోర్టుకు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్షలండి’ పేరుతో సాక్షిలో అస‌త్య క‌థ‌నంపై లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

Lokesh: పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానున్న  లోకేష్

విశాఖపట్నం: సాక్షి (Sakshi)పై వేసిన పరునాష్టం దావా కేసు (Case)లో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శుక్రవారం విశాఖ (Visakha)లో కోర్టు (Court)కు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్షలండి’ పేరుతో సాక్షిలో అస‌త్య క‌థ‌నంపై లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సాక్షిపై వేసిన ప‌రువున‌ష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జ‌ర‌గ‌నుంది. ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిప‌త్రిక‌లో అస‌త్యాలు, క‌ల్పితాల‌తో ఓ స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాల‌తో ఉద్దేశ‌పూర్వకంగా త‌న‌ను డ్యామేజ్ చేయాల‌ని ఈ స్టోరీ వేశార‌ని నారా లోకేష్ అప్పట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.


అయితే దీనిపై సాక్షి ఎటువంటి వివ‌ర‌ణ వేయ‌క‌పోవ‌డం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను విశాఖ‌లో ఉన్నాన‌ని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖ‌ర్చుని త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్రతిష్టని మంట‌గ‌లిపేందుకు ప్రయ‌త్నించార‌ని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు.


వాస్తవానికి వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. ఇది సర్వసాధారణం. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ సైతం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఒక నిరాధార కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీనిపై అప్పట్లోనే నారా లోకేష్ మండిపడ్డారు. నీతి లేని కథనాలను సాక్షి ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సాక్షి స్పందించాలేదు. దీంతో సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు లోకేష్ కోర్టుకు హాజరుకానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

నాంపల్లి కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్

అమరావతి: సూపర్ 6తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 18 , 2024 | 09:59 AM