Botsa: జగన్ తిరుపతి పర్యటన రద్దుకు కారణం చెప్పిన బొత్స
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:45 PM
Andhrapradesh: చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయవోద్దని భగవంతుడిని ప్రార్ధించామని బొత్స తెలిపారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని విమర్శించారు. శ్రీవారి లడ్డూపై భక్తులను గందరగోళంకు గురి చేశారని అన్నారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 28: వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆపార్టీ నేతలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) మాట్లాడుతూ.. ‘‘మా అధినేత ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ నాయకులు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు’’ అని తెలిపారు. అపచారాలను మన్నించాలని ఆలయాలకు వెళ్లి క్షమాపణ కోరుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయొద్దని భగవంతుడిని ప్రార్ధించామన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని విమర్శించారు. శ్రీవారి లడ్డూపై భక్తులను గందరగోళానికి గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాన్ని పదే పదే చెబుతూ నిజం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Internet: త్వరలోనే కొత్త ఇంటర్నెట్.. ఏ మూలకైనా అదిరిపోయే సిగ్నల్..
నెయ్యిలో కల్తీ జరిగితే థర్డ్ పార్టీతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తే ఆటంకాలు సృష్టించాలని బీజేపీ నాయకులు చూశారని మండిపడ్డారు. జగన్ తిరుమల దర్శనానికి వెళ్లాలని ప్రయత్నిస్తే పోలీసులు ఆటంకాలు కల్పించారన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు జరిగి ఉంటే తప్పకుండా శిక్షించాలన్నారు. చంద్రబాబు చేసింది తప్పు కాబట్టి హైకోర్టు, సుప్రీం కోర్టు, సీబీఐకు విచారణ జరిపించాలని లేఖ రాయలేకపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. సామాన్యులు భక్తులు ఇబ్బంది పడతారని తిరుపతి పర్యటనపై నిర్ణయం తీసుకున్నారని వివరణ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో రాజకీయం చేయడం ధర్మనేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సీబీఐలకు విచారణ జరిపించాలని లేఖ రాయాలని అన్నారు.
స్టీల్‌ప్లాంట్‌పై ఇలా...
స్టీల్ ప్లాంట్‌లో 4 వేల మంది కార్మికులను తొలగిస్తే దానికి సమాధానం చెప్పేవారు లేరన్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్పారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయన్నారు. బియ్యం కూడా కొనుక్కొనే పరిస్థితి ప్రజలకు లేదని విమర్శించారు. చారు అన్నం కూడా తినే పరిస్థితి లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 వేల కోట్లు అప్పు చేశారని... అప్పులు చేయడమేనా సంపద సృష్టి అంటే అని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
Perni Nani: చంద్రబాబుపై మరోసారి నోరుపారేసుకున్న పేర్నినాని
SIT: టీటీడీ లడ్డూ వివాదం.. తిరుపతికి సిట్.. విచారణ షురూ
Read Latest AP News And Telugu News