Share News

Vizag: దసపల్లా భూములపై ప్రభుత్వం ఆరా!

ABN , Publish Date - Oct 14 , 2024 | 08:31 AM

వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ భూములు నిషేధిత జాబితా 22-ఏ నుంచి తొలగింపు ప్రక్రియ మొదలుకొని అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి జరిగిన ఒప్పందంలో గూడుపురాణిపై నిగ్గుతేల్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Vizag: దసపల్లా భూములపై ప్రభుత్వం ఆరా!

  • ఇప్పటివరకు ఏం జరిగిందో నివేదించండి

  • వివరాలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం

విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ భూములు నిషేధిత జాబితా 22-ఏ నుంచి తొలగింపు ప్రక్రియ మొదలుకొని అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి జరిగిన ఒప్పందంలో గూడుపురాణిపై నిగ్గుతేల్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైసీపీ పెద్దలకు భారీ లాభం చేకూరేలా ఈ వ్యవహారంలో ఏం జరిగిందో నివేదించాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం వివరాల సేక రణలో నిమగ్నమైంది. గత ప్రభుత్వ హయాంలో కీలక పెద్దల ప్రమేయం తో నగరంలో అత్యంత ఖరీదైన భూములు చేతులుమా రాయి. మరిన్ని బలవంతంగా దోచుకోగా, అందులో ద సపల్లా భూముల వ్యవహారం ఒకటి. భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాలను శారదాపీఠాధిపతికి ఎకరా రూ. లక్షకు కట్టబెట్టడంపై ఇప్పటికే ప్రభుత్వాని కి జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది.


ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్ భూముల వ్యవహారం. నిర్మాణా లపై తాజాగా స్థితిని తెలియజేస్తూ వివరాలు పంపారు. ఇప్పుడు దసపల్లా భూములపై వాస్తవ పరిస్థితు లు తెలియజేసేలా సమగ్ర నివేదిక పంపాలని ప్రభు త్వం ఆదేశించిన నేపథ్యంలో మరిన్ని భూవ్యవహారాల పై పాలకులు దృష్టిసారించారని స్పష్టమైంది. చినవా రు సర్వే నంబరు 1027, 1028, 1186, 1197 లో 60 ఎ కరాల్లో ప్రభుత్వ అవసరాలకు పోగా మిగిలిన 15 ఎక ఇ ల్లో ఉన్న దసపల్లా భూములు కాపాడుకునేందుకు గతంలో ప్రభుత్వ అధికారులు సమర్థంగా వ్యవహరిం లేదు.

ఈ నేపథ్యంలో దసపల్లా భూములకు 2014లో అప్పటి కలెక్టర్ యువరాజ్ నిషేధిత జాబితా 22-ఏలో చేర్చారు. 2023 వరకు భూములు అలాగే ఉన్నాయి. ఈ భూములపై కన్నేసిన వైసీపీ పెద్దల ఒత్తిడితో గత కలెక్టర్ 22-ఏ నుంచి తప్పించారు. దీంతో అక్కడ ఆకాశ హార్యాలు నిర్మించాలని కీలకనేత తన కుమార్తెకు చెం దిన కంపెనీకే డెవలప్మెంట్ బాధ్యతలు అప్పగించారు. డెవలప్మెంట్‌లో భూయజమానులకు కేవలం 30 శాతం, ప్రభుత్వ పెద్దలు, నిర్మాణ సంస్థకు 70 శాతం వాటా తీసుకున్నారు. ఇక్కడ 75,999 చదరపు గజాల స్థలంలో 27.55 లక్షల చదరపు అడుగుల నివాస, వాణిజ్య భవనాలు నిర్మిస్తామని అగ్రిమెంట్ లో పేర్కొన్నా రు.


గత ప్రభుత్వ హయాంలో నగరంలో అనేక సెటిల్మెంట్లకు పాల్పడిన, యూఎల్ సీ కింగ్గా పేరొందిన వ్యక్తి ఇందులో భారీగా లబ్ది పొందారు. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ లో ఆప్పటి సబ్ రిజిస్టర్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దసపల్లా భూముల వ్య వహారంలో వేలకోట్ల లావాదేవీలపై గత ప్రభుత్వ హయాంలో ఆప్పటి విపక్ష టీడీపీ, జనసేన నేతలు వేర్వేరుగా పోరాటాలు చేశారు. కూటమి అధికారం చేపట్టిన తరువా త గత నెలలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా దసపల్లా భూములను సందర్శించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన దర్బార్లో ఈ భూములపై కొంతమంది ఆయనకు ఫిర్యాదుచేశారు. విశాఖలో భూముల దోచుకున్న వ్యవహారం పై సమగ్రంగా విచారణ చేయాలనే ఆలోచనతో దసపల్లా భూములపై ప్రభుత్వం ని వేదిక కోరింది. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై జిల్లా యంత్రాం గం నివేదిక సిద్ధంచేసి పంపనున్నది.

MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కేబీఆర్‌ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్‌

For Latest News and National News click here

Updated Date - Oct 14 , 2024 | 08:32 AM