AP News: అయ్యో పాపం.. కుక్క కాటుతో బాలుడికి మూడు నెలలుగా చికిత్స.. అంతలోనే
ABN , Publish Date - Aug 05 , 2024 | 12:16 PM
Andhrapradesh: జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం తీముల బంధగ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కార్తీక్ (13) కుక్క కాటుతో మృతి చెందాడు. మూడు నెలల క్రిందట కార్తీక్ కుక్క కాటుకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం చింతపల్లి ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు.. గత మూడు నెలలుగా చింతపల్లి హాస్పిటల్లో కార్తీక్ చికిత్స పొందుతున్నాడు.
అల్లూరి జిల్లా, ఆగస్టు 5: జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం తీముల బంధగ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కార్తీక్ (13) కుక్క కాటుతో (Dog Bite) మృతి చెందాడు. మూడు నెలల క్రిందట కార్తీక్ కుక్క కాటుకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం చింతపల్లి ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు.. గత మూడు నెలలుగా చింతపల్లి హాస్పిటల్లోనే కార్తీక్ చికిత్స పొందుతున్నాడు. అయితే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న విశాఖపట్నం కేజీహెచ్‌లో బంధువులు బాలుడుని చేర్పించారు.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్
అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు మూడు నెలల క్రితం కుక్క కరవడంతో వ్యాక్సిన్ వేయించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందని తెలిపారు. అప్పటికే కార్తీక్ ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో చివరి క్షణాలు తమ గ్రామంలో ఉండాలని తల్లిదండ్రులు భావించారు. ఇంటికి వెళ్లేందుకు కార్తీక్, తల్లిదండ్రులతో కలిసి విశాఖ నుంచి అరకు బస్సు ఎక్కాడు. అయితే మార్గమధ్యలోనే కార్తీక్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మృతి చెందాడు. బిడ్డ చనిపోయాడని గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Pawan Kalyan: ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం..
కార్తీక్ తల్లిదండ్రులను ఓదార్చిన బస్సు డ్రైవర్.. అరకు కాంప్లెక్స్‌లో వారిని దించారు. కన్నబిడ్డ మృతదేహంతో అరకు కాంప్లెక్స్ సమీపంలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న తీరు అరకులో స్థానికులను కలచివేసింది. వీరి దయనీయ పరిస్థితిని గుర్తించిన స్థానికులు తలా కొంత ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని అరకు ఎంపీ తనుజారాణి దృష్టికి తీసుకెళ్లగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో తీవ్రవిషాదంతో బాలుడు మృతదేహాన్ని తీసుకొని తల్లిదండ్రులు వారి సొంతూరికి పయనమయ్యారు.
ఇవి కూడా చదవండి...
Youtube : యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు!
TDP Vs YSRCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంచుకోటలో టీడీపీ మాస్టర్ ప్లాన్!
Read Latest AP News And Telugu News