Drugs: ఇందులో ఏ రాజకీయపరమైన కోణాలు లేవ్..: విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై సీపీ
ABN , Publish Date - Mar 22 , 2024 | 01:02 PM
ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేగిన విషయం తెలిసిందే. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటెయినర్‌లో సుమారు 25వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ.. విశాఖలో డ్రగ్స్ పట్టుబడిందని.. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపడుతోందన్నారు.
విశాఖపట్నం: ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేగిన విషయం తెలిసిందే. బ్రెజిల్ (Brazil) నుంచి వచ్చిన ఓ కంటెయినర్‌లో సుమారు 25వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై విశాఖ (Visakha) నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ (CP Ravishankar) మాట్లాడుతూ.. విశాఖలో డ్రగ్స్ పట్టుబడిందని.. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపడుతోందన్నారు. విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ తమ పరిధిలోనిది కాదన్నారు.
AP Elections: ఎమ్మెల్యే ద్వారంపూడిని ఏకిపారేసిన జనం..
అనుమానిత మాదక ద్రవ్యాలు కేస్ పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని రవి శంకర్ తెలిపారు. కస్టమ్స్ అధికారుల రిక్వెస్ట్ మీద విశాఖ పోలీస్ కమిషనరేట్ (Visakha Police Commissionarate) నుంచి డాగ్ స్క్వాడ్ బృందాన్ని పంపామన్నారు. తమ వల్ల సోదాలు ఆలస్యం జరిగాయనే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వాళ్ల టెక్నికాలిటీ కోసం అలా రాశారు తప్పితే ఇందులో వాస్తవం లేదని రవిశంకర్ వెల్లడించారు. అంతే తప్ప వారి సీబీఐ విధి నిర్వహణకు ఏ విధమైన అడ్డూ తమ వల్ల కలగలేదన్నారు. విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపుతున్నామన్నారు. ఇందులో ఏ రాజకీయపరమైన కోణాలు లేవని.. ఏదైనా నిర్ధారించుకున్న తర్వాతే, మీడియా ప్రచురించాలని కోరుతున్నామని రవిశంకర్ తెలిపారు.
AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడుతున్న కౌన్సిలర్లు
ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటెయినర్‌లో సుమారు 25వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. కేంద్ర నిఘా సంస్థలు ఉమ్మడిగా ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. సుమారు 25 వేల కిలోల ‘డ్రై ఈస్ట్’తో కలిపి ఉన్న కొకైన్‌ను స్వాధీనం చేసుక్నుట్టు వెల్లడించారు. అయితే ఎంతమొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారో తెలియాల్సి ఉంది. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి షిప్ కంటైనర్‌లో భారీ పరిమాణంలో మాదక ద్రవ్యాలను విశాఖకు తరలిస్తున్నట్టు పసిగట్టిన ఇంటర్‌పోల్.. ఢిల్లీలోని సీబీఐ అధికారులను అప్రమత్తం చేసింది.
TDP: విశాఖ పోర్టులో ఏపీ అధికారులకు ఏంపని?: పట్టాభి
అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సీబీఐ (CBI) అధికారులు.. కస్టమ్స్ (Customs) అధికారుల సహాయంతో మాదక ద్రవ్యాలతో ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులోని సరకును పరిశీలించేందుకు ఈ నెల 19న ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు. సుమారు 25 వేల కిలోల (ఒక్కొక్కటి 25 కిలోలున్న వెయ్యి బ్యాగులు) ఇన్‌యాక్టివ్ డ్రై ఈస్ట్‌తో నార్కోటిక్స్ డ్రగ్స్ (Narcotic Drugs)ను కలిపినట్టు నిర్ధారించారు. డ్రగ్స్‌తో వచ్చిన కంటైనర్‌ను విశాఖలో ఆక్వా ఎగుమతులు, దిగుమతులు చేపట్టే సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరిట బుక్ చేసినట్టు సీబీఐ అధికారులు తేల్చారు. ఆ కంపెనీ ప్రతినిధులతోపాటు మరికొందరిపై ఎన్‌డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగిలిన వివరాలను రాబట్టాల్సి ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.
TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..