Share News

Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు

ABN , Publish Date - May 17 , 2024 | 01:16 PM

విశాఖ: వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు

విశాఖ: వైసీపీ (YCP) గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు (Vishnukumar Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విశాఖ (Visakha)లో మీడియాతో మాట్లాడుతూ.. కంచరపాలెం పోలీసు స్టేషన్ ఎస్ఐ.. కేసును పక్కదారిన పట్టిస్తున్నారని.. వైసీపీ గూండాలకు పోలీసు వ్యవస్థ సపోర్టు చేస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనతో పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో సీపీ మీద తప్ప వేరే ఎవరిమీద తమకు నమ్మకం లేదని.. సీపీ అపాయింట్ మెంట్ కోరామని అన్నారు. ఆయన అపాయింట్ మెంట్ వచ్చిన తర్వాత బాధితులతో కలసి వెళ్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనలో 10 మంది ప్రమేయం ఉందని, అందర్నీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైసీపీ దాడిని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు.


బాధితుల కామెంట్స్....

బర్మా క్యాంప్ ఏరియాలో ఎలక్షన్స్ ముందు నుంచి పెద్ద గొడవలు జరిగాయని, కూటమి అభ్యర్ధులు, నేతలు ప్రచారానికి వచ్చినప్పుడు వైసీపీ అడ్డుకునేదని చెప్పారు. ఓటు విషయంలో తాము కూటమి అభ్యర్దులకు ఓటు వేశామని చెప్పామని.. ఇది అందరికి తెలిసిపోయిందన్నారు. దీంతో వైసీపీ వాళ్లు ఆగ్రహంతో తమపై దాడులు చేశారన్నారు. 100కు ఫోన్ చేస్తామని అనడంతో పారిపోయారని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ వచ్చి తమ కుటుంబంపై విచక్షణ రహితంగా దాడులు చేశారని, చంపడానికి ప్రయత్నం చేశారని, పోలీసులు కూడా దాడి చేసిన వారి వైపే మాట్లాడుతున్నారని, తమకు న్యాయం జరగాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


కాగా విశాఖపట్నంలో వైసీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో టీడీపీ సానుభూతిపరులపై దాడి చేసి దారుణంగా తలలు పగలగొట్టారు. మహిళలని కూడా చూడకుండా రాత్రివేళ ఇంట్లోకి చొరబడి మరీ కొట్టారు. ఈ ఘటన విశాఖ నగరంలోని కంచరపాలెంలోని బర్మా క్యాంపులో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం...సుంకరి ఆనందరావు, భార్య ధనలక్ష్మి (44), కుమార్తె నూకరత్నం (24), కుమారుడు మణికంఠ (26)లతో కలిసి ఉంటున్నారు. వీరికి టీడీపీ హయాంలో ఇల్లు వచ్చింది. దానికి సంబంధించిన శిలాఫలకం ఇంటి ముందు ఉంది. దానిని తీసేయాలని రెండిళ్ల అవతల ఉన్న పూతి ఆశ, బత్తుల కనకరత్నం తదితరులు గొడవ పడేవారు. ఇది కాకుండా మురుగు కాలువకు సంబంధించిన గొడవ కూడా ఉంది. నెల రోజుల క్రితం కూడా గొడవ పడ్డారు. ఇటీవల ఎన్నికల సమయంలో వైసీపీ వారు డబ్బులు ఇస్తారని, ఓటు వేయాలని ఆశా, కనకరత్నం...సుంకరి కుటుంబ సభ్యులను కోరారు. తాము తెలుగుదేశానికి ఓట్లు వేస్తామని సుంకరి కుటుంబ సభ్యులు చెప్పారు. అన్నట్టే చేశారు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి ధనలక్ష్మి, ఆమె పిల్లలు ఇంటి ముందు ఉండగా, ఆశా కుటుంబానికి చెందిన లావేటి లోకేశ్‌ అనే యువకుడు మద్యం తాగి వచ్చి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా వైసీపీకి ఓట్లు వేయలేదని నిందించాడు. దీంతో మాటామాటా పెరిగింది. కొట్టుకునేంత వరకు వెళ్లింది. లోకేశ్‌ పెద్ద కర్ర తీసుకువచ్చి ధనలక్ష్మి, నూకరత్నం, మణికంఠను తలపై గట్టిగా కొట్టి గాయపరిచాడు. ఇంతలో ఆశ...ఒక ఐరన్‌ రాడ్‌ తీసుకువచ్చి దాడి చేసింది. తలలు పగలి తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితులు 108 ద్వారా కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. అక్కడి అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన వివరాలతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదుచేశారు.


లోకేశ్‌పై హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్‌కు పంపించారు. మరో నలుగురు పూతి ఆశ, బత్తుల కనకరత్నం, కోనేటి సాయబాబు, బాయి భూలోక్‌లపై 354, 324, 334 తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. వారెవరినీ అరెస్టు చేయలేదు. దాడి చేసిన వారికి స్థానిక వైసీపీ నాయకుడు అండగా ఉన్నారని, ఆయనే ఈ కేసు సీరియస్‌ కాకుండా ఐదో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐని మేనేజ్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా బాధితులకు తలలు పగిలిపోయిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కంచరపాలెం డీసీపీ మేకా సత్తిబాబు, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి గురువారం రాత్రి అత్యవసరంగా విలేకరుల సమావేశం పెట్టారు. ఇందులో రాజకీయ కక్షలు లేవని, అలా ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రకటించారు. ఇది పూర్తిగా 100 శాతం వ్యక్తిగత కక్షలతో జరిగిన గొడవ అని వివరించారు. ఇదిలా ఉండగా బాధితురాలు ధనలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, తాము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశామనే కక్షతోనే దాడి చేశారని ఆరోపించారు. పాత గొడవలు ఉన్నా అవి ఈ దాడికి కారణం కాదన్నారు. ఓట్లకు డబ్బులు తీసుకోలేదని, వైసీపీకి ఓటు వేయలేదనేదే దాడికి కారణమని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పల్నాడు జిల్లా: సర్పంచ్ ఇంటిపై వైసీపీ దాడి..

పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు

విధుల్లో చేరిన గంగవరం పోర్ట్ ఉద్యోగులు

పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్

బయటపడిన జగన్ నిజస్వరూం..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 17 , 2024 | 01:19 PM