AP Elections: టీడీపీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబు కీలక ప్రకటన
ABN , Publish Date - Apr 15 , 2024 | 07:03 PM
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్‌లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ సిక్స్‌తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు..? వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్‌లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ సిక్స్‌తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు..? వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు. సోమవారం నాడు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో జరిగిన కానిస్టేబుల్, డీఎస్సీ ఉద్యోగాలపై కీలక ప్రకటనే చేశారు. అంతేకాదు.. రైతన్నలకు, పెన్షన్ల విషయంపై కూడా తియ్యటి శుభవార్తే చెప్పారు చంద్రబాబు.
శుభ వార్తలు..!
‘ టీడీపీ అధికారంలోకి రాగానే 25వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు రూ.25 వేలు ఇస్తాం. వెనుకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్’ అని చంద్రబాబు కీలక ప్రకటనలే చేశారు. ‘ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలుస్తాం. టీడీపీ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. జగన్... జే..గన్ రెడ్డి. జగన్ అబద్ధాలు అద్భుతంగా చెబుతాడు. జగన్ అబద్ధాలు చెప్పడంలో పీహెచ్‌డీ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని గాలికి వదిలేశారు. జగన్ అంతా రివర్స్ పాలనే. జగన్ పాలనలో ఏపీ భ్రష్టు పట్టిపోయింది. జగన్ ఒక మానసిక రోగి’ అని చంద్రబాబు ఆరోపించారు.
అవును.. నేనే!
‘జగన్‌రెడ్డిది విధ్వంస రాజ్యం. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర కబ్జాలతో విలవిలలాడింది. నేను విశాఖను వాణిజ్య రాజధాని చేశాను. డ్రగ్స్, గంజాయి రాజధానిగా జగన్ మార్చాడు. జగన్‌కు విశాఖ మీద ప్రేమ లేదు.. ఇక్కడ సంపద మీదే ప్రేమ. ఉత్తరాంధ్రపై విజయసాయి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి?. నేను రాష్ట్రంలో సంపద సృష్టించాను.. జగన్ మాత్రం తన ఇంటికి సంపద పెంచుకున్నాడు. జగన్ చెప్పేని అబద్ధాలు.. చేసేవి మోసాలు. గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారు. చేసిన నేరాలను ఇతరులపై తోయడంలో జగన్ దిట్ట’ అని జగన్‌పై తీవ్ర స్థాయిలో చంద్రబాబు ధ్వజమెత్తారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి