CM Chandrababu: ఈ నెల 17 లోపు నష్ట పరిహారంపై నిర్ణయం: చంద్రబాబు
ABN , Publish Date - Sep 11 , 2024 | 01:50 PM
ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటిస్తున్నారు. తమ్మిలేరును పరిశీలించిన అనంతరం ఆయన సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..
ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం ఏలూరు (Eluru)లో పర్యటిస్తున్నారు. తమ్మిలేరు (Tammileru)ను పరిశీలించిన అనంతరం ఆయన సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, (Farmers) వరద బాధితులతో (Flood Victims) ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీలోపు నష్ట పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని, వరికి మాత్రం ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉప్పుటేరుపై రెగ్యెలేటర్ నిర్మాణంపై సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో 72 శాతం పూర్తిచేసామని.. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరాన్ని ముంచేసారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు పోలవరం పూర్తిచేయాలనే ఉద్ధేశ్యంతో కేంద్రంతో మాట్లాడి రూ. 12 వేల కోట్లు తీసుకువచ్చామన్నారు. త్వరలోనే పోలవరం పనులు మొదలుపెడతామని స్పష్టం చేశారు. వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తీసుకుంటామని, వరదల వలన సాగునీటి సంఘాల ఎన్నికలు ఆలస్యం అయ్యాయని, త్వరలోనే అవి వస్తాయని తెలిపారు. శనివారపుపేట కాజ్‌వే స్థానంలో వంతెన నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నానని, పెదపాడు మండలంలో లోయేరు వాగు మరమత్తులు చేపడతామని చెప్పారు. వరదల వలన నష్టపోయిన అందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు. తాను, తన మిత్రుడు పవన్ కళ్యాణ్, బీజేపీలు (కూటమి ప్రభుత్వం) సుపరిపాలన అందిస్తామని, కౌలు రైతుల ఖాతాల్లోకి నేరు ఇన్ పుట్ సబ్సీడీ వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
గతంలో బుడమేరు గండ్లు వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని, భారీ వరదలకు వాతావరణంలో మార్పులే కారణమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో బుడమేరు ఆక్రమణలు జరిగాయని, తప్పుడు రిజిస్ట్రేషన్లతో అక్రమ కట్టడాలకు అధికారులు అనుమతి ఇచ్చారని, వైసీపీ పాలనతో నకిలీ బిల్లులతో డబ్బును కాజేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రకృతి విపత్తుతో ప్రజలకే నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు గండ్లు పూడ్చివేతతో విజయవాడకు వరద ఆగిందన్నారు.
బోట్లు వదిలి ఏమీ తెలియనట్లు వైసీపీ నేతలు వ్యవహారిస్తున్నారని, బోట్లను వదిలింది వైసీపీకి చెందినవారేనని సీఎం చంద్రబాబు అన్నారు. బ్యారేజీకి వచ్చింది అక్రమ ఇసుక వ్యాపారం చేసే బోట్లేనని స్పష్టం చేశారు. నేరాలు చేసే వ్యక్తులు ప్రజా జీవితంలో ఉంటూ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మొత్తం దోచేసిందని, అప్పులు మిగిల్చిందని.. వాటిని భర్తీ చేస్తున్నామని, ఖాళీ ఖజానాతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ఏలూరు పర్యటన ముగించుకుని కాకినాడ జిల్లాకు బయల్దేరారు. కిర్లంపూడిలో చంద్రబాబు పర్యటిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జైలు బయట మాజీ సీఎం జగన్ సెల్ఫీలు..
వాటర్ ట్యాంక్‌పై వినాయకుడు.. ఐడియా అదిరింది..
కేంద్ర ఆర్థిక సంఘంతో రేవంత్ రెడ్డి బృందం భేటీ.. (ఫోటో గ్యాలరీ)
గోదావరి మహోగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..
అందుకే తేజస్వీతో సీఎం నితీశ్ భేటీ...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News