TDP: దెందులూరు ఎవడబ్బ సొమ్ము కాదు.. చింతమనేని ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 10 , 2024 | 12:59 PM
Andhrapradesh: దెందులూరు ఎవడబ్బ సొమ్ము కాదు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏలూరు, జనవరి 10: దెందులూరు ఎవడబ్బ సొమ్ము కాదు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Former MLA Chintamaneni Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘దెందులూరులో నా చెమట, నా రక్తం, మీ కష్టం అన్నీ ఉన్నాయి. వీటన్నింటిని కలబోసి రాజకీయం చేస్తున్నాము. ఎవడుపడితే వాడు, ఎక్కడపడితే అక్కడ నాలుగు రూపాయలున్నాయి కదా అని బ్యాగులేసుకొస్తే వెంట్రుక కూడా పీకలేరు. నాయకుడు అనే వాడు ప్రజల్లో నుంచే పుడతాడు. ఎవడుపడితే వాడు వచ్చేసి నేను ఉన్నాను.. నేను వస్తాను అని చెబితే, దెందులూరు వాళ్లు అమాయకులు ఏమీ కాదు’’ అంటూ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..