Balaraju: పోలవరం ఎమ్మెల్యే కారుపై దాడి కేసులో విచారణ వేగవంతం
ABN , Publish Date - Jul 30 , 2024 | 12:44 PM
Andhrapradesh: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు కారుపై జరిగిన రాయి దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దాడి జరిగిన ప్రాంతమైన హాస్టల్ పరిసరాల్లో జీలుగుమిల్లీ సీఐ క్రాంతి కుమార్, బుట్టాయిగూడెం ఎస్సై వెంకన్న తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... కర్రలతో దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు.
ఏలూరు, జూలై 30: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు కారుపై జరిగిన రాయి దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దాడి జరిగిన ప్రాంతమైన హాస్టల్ పరిసరాల్లో జీలుగుమిల్లీ సీఐ క్రాంతి కుమార్, బుట్టాయిగూడెం ఎస్సై వెంకన్న తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... కర్రలతో దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు. దాడి ఘటనలో కారులో ఎమ్మెల్యే బాలరాజు లేరని తెలిపారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేసి నిందితులను పట్టుకుంటామని జీలుగు మిల్లీ సీఐ క్రాంతి కుమార్, బుట్టాయిగూడెం ఎస్సై వెంకన్న స్పష్టం చేశారు.
Balaraju: జనసేన ఎమ్మెల్యే సడెన్ ఎంట్రీ.. దొరికిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!?
అసలేం జరిగిందంటే..
ఎమ్మెల్యే బాలరాజు కారుపై గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద ఎమ్మెల్యే కారుపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే కారుపై దాడి ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అయితే దీనిపై ఎమ్మెల్యే స్వయంగా ఓ ప్రకటన చేశారు. ‘‘బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయలుదేరిన నా వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో కారులో నేను లేను. నేను సేఫ్‌గా ఉన్నా నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఘటనపై విచారించి దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఎమ్మెల్యే బాలరాజు ప్రకటించారు. ఈ సంఘటనపై పోలీసు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పందించారు. ఈ ఘటనను డిప్యూటీ సీఎం తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Kerala Landslide: అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా
ఓ సామాన్యుడిలా....
మరోవైపు ఓ సామాన్యుడిలో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పని విషయంలో అలసత్యం వహిస్తున్న ఉద్యోగిపై ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాతో హల్‌చల్ చేస్తోంది. కేటీఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు ఓ సామాన్యుడిలా వెళ్లారు. మొహానికి మాస్కు పెట్టుకుని ఆఫీసులో తనిఖీకి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఓ ఉద్యోగి.. పనిని పక్కన పెట్టేసి తాపీగా ఫోన్‌లో పబ్జి గేమ్ ఆడుకుంటూ ఎమ్మెల్యే కళ్లకు చిక్కాడు. సదరు ఉద్యోగి సాయికుమార్‌గా తెలుస్తోంది. ఆ ఉద్యోగి వెనకాలే ఉండి చాలా సేపు అతడు చేస్తున్న పనిని ఎమ్మెల్యే గమనించారు. పనివేళల్లో పబ్జీ గేమ్ ఆడుతున్న ఉద్యోగిని ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాకుండా అతడిని సస్పెండ్ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే బాలరాజు ఆదేశాలిచ్చారు.
ఇవి కూడా చదవండి...
AP Tourism: పర్యాటకులకు శుభవార్త.. ఆ జలపాతాల సందర్శనకు అనుమతి..
Read Latest AP News And Telugu News