Share News

Kakinada Port: అధికారం అండతో అరాచకం..

ABN , Publish Date - Dec 06 , 2024 | 09:47 AM

కాకినాడ పోర్టుకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేస్తున్న బియ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించారు.

Kakinada Port: అధికారం అండతో అరాచకం..

అమరావతి: అధికారం అండతో అరాచకం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనం.. కన్నేసిన ప్రతిదాన్ని కబ్జాచేసే నియంతృత్వం.. అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం.. కానినాడ సీ పోర్టు (Caninada Sea Port)ను హస్తగతం చేసుకోడానికి అప్పటి సీఎం జగన్ (Jagan) ఇలాగే జగన్నాటకం ఆడారు. కేవీరావు (KV Rao) నుంచి బలవంతంగా పోర్టు వాటాలను తీసుకోవడంలోనూ ఇదే జరిగింది. రాష్ట్ర విజిలెన్స్ విభాగాన్ని (Vigilance Department) అడ్డగోలుగా వాడుకున్నారు. మారిటైం బోర్డులోనూ రంగంలోకి దించారు.

కాకినాడ పోర్టుకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేస్తున్న బియ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించారు. దీనిపై పవన్ సీఎం చంద్రబాబును కలిసి నివేదిక ఇవ్వడంతోపాటు మొత్తం అంశాన్ని వివరించారు. గత ఐదేళ్లుగా రూ. వేల కోట్ల అక్రమాలు జరగడంపై ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


కాగా కాకినాడ పోర్టు యజమాని కేవీ రావును బెదిరించి రూ.మూడు వేల కోట్ల విలువైన వాటాలు లాక్కున్న నాటి సీఎం జగన్‌ టీమ్‌ వ్యవహారంలో సీఐడీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఈ దందా మూలాలపై లోతుగా దృష్టి సారించింది. షేర్ల బదిలీ, ఆస్తుల మార్పిడి పద్ధతి ప్రకారమే జరిగిందా.....అన్ని అనుమతులు తీసుకునే చేశారా... తదితర వివరాలు కోరుతూ... పెట్టుబడులు, మౌలిక వసతులు (ఐఅండ్‌ఐ), రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ), మారిటైమ్‌ బోర్డుకు సీఐడీ లేఖలు రాసింది. పాతిక సంవత్సరాల (1999) క్రితం ప్రైవేటు యాజమాన్యంలోకి వెళ్లిన కాకినాడ పోర్టులో వాటాల విక్రయానికి విధివిధానాలేంటి....కేవీ రావు చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి 900 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాట నిజమా....పోర్టు యాజమాన్యం (42శాతం) చేతులు మారిన తర్వాత దానిని రూ.9కోట్లుగా మాత్రమే చూపించింది వాస్తవమా.... లాక్‌ ఇన్‌ పిరియడ్‌ ఎన్ని సంవత్సరాలుంది.. వాటాల బదిలీ సమయంలో ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ వచ్చాయా.. యాజమాన్య బోర్డులో తీర్మానం నెగ్గిందా.. కొనుగోలు చేసిన కంపెనీ నుంచి అటువంటి తీర్మానం ఏదైనా ఉందా....కేవీ రావు నుంచి అరబిందోకు షేర్ల బదిలీ వ్యవహారాలు చూసిందెవరు.... అరబిందో డైరెక్టర్ల పాత్ర ఎంతమేరకు ఉంది.... పోర్టు అంటే సెక్యూరిటీ కూడా ముఖ్యమే.. కేంద్రం దృష్టికి బదిలీ వ్యవహారం వెళ్లిందా... రక్షణ కోణంలో మార్గదర్శకాలు అనుసరించారా?....అంటూ సీఐడీ అధికారులు... పై మూడు సంస్థలకు లేఖలు రాశారు. వారి నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి నిందితులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు సమాచారం. జగన్‌ పేరు చెప్పి కేవీ రావును బెదిరించిన వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి(ఏ1) ఇప్పటికే ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు ఫోను చేసి విక్రాంత్‌తో మాట్లాడాలంటూ కేవీ రావుపై ఒత్తిడి తెచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఏ2) ఢిల్లీలో ఎదురు దాడి చేస్తున్నారు. షేర్లు బదిలీ చేయించుకున్న అరబిందో యజమాని శరత్‌చంద్రారెడ్డి, ఆడిటర్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సీఐడీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కేసు వీగిపోకుండా పకడ్బందీగా ఉచ్చు బిగించే క్రమంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. కాగా, కాకినాడ సీపోర్టు లిమిటెడ్‌ కార్యాలయానికి గురువారం సీఐడీ అధికారులు వెళ్లారు. అక్కడే అర్ధరాత్రి వరకు ఉన్నారు. కార్యాలయ సీఈవోతోపాటు మరికొందరు ఉద్యోగులను నాటి వ్యవహారాలపై ఆరా తీశారు.


విజయసాయి సహా నిందితులపైనా లుకవుట్‌..

కేవీ రావును బెదిరించి షేర్లు లాక్కున్న కేసులో విజయసాయిరెడ్డి (ఏ2)తోపాటు ఇతర నిందితులపై సీఐడీ లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) జారీ చేసింది. జగన్‌ చిన్నాన్న, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌ రెడ్డి(ఏ1), విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లోనూ నిందితుడైన అరబిందో యజమాని శరత్‌ చంద్రారెడ్డిపైనా ఎల్‌వోజీ ఇచ్చింది. నిందితులు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో ముందస్తు జాగ్రత్తగా ఎల్‌వోసీ జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..

ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు..

విశాఖలో డీప్‌ టెక్నాలజీ సదస్సు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 06 , 2024 | 09:47 AM