Raghurama: జగన్.. చెంపలు వేసుకుని మరీ.. తిరుమల లడ్డూను తిను
ABN , Publish Date - Sep 26 , 2024 | 01:57 PM
Telangana: జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనేది అందరికీ తెలిసిందే అని.. ఎవరైనా తిరపతి వెళ్లాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని ఎమ్మెల్యే రఘురామ స్పష్టం చేశారు. మతపరంగా అన్య మతస్థుడు తిరుపతి వెళ్లాలంటే హిందూ మతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలన్నారు.
పశ్చిమగోదావరి, సెప్టెంబర్ 26: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (Former CM Jaganmohan reddy) ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు (MLA Raghurama krishnam Raju) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. క్రైస్తవుడు అయిన జగన్మోహన్ రెడ్డి మెట్లు ఎక్కి కాలినడకన తిరుపతి వెళుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనేది అందరికీ తెలిసిందే అని.. ఎవరైనా తిరపతి వెళ్లాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. మతపరంగా అన్య మతస్థుడు తిరుపతి వెళ్లాలంటే హిందూ మతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలన్నారు.
Viral Video: బికినీ వేసుకునేందుకు భార్య కోసం భర్త ఏం చేశాడంటే..
పాపపరిహారార్థం జగన్మోహన్ రెడ్డి చెంపలు వేసుకుని తిరుపతి లడ్డూను వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో తిరుపతి లడ్డూను తినాలని అన్నారు. పాప పరిహారార్ధం తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డిని స్వామివారు తిరుపతికి పిలిచినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అందరితో కలిసి స్వీకరించామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లడ్డూ స్వచ్ఛమైన నేతితో చాలా అద్భుతంగా తయారుచేశారని చెప్పారు. భక్తులు లడ్డూ ప్రసాదంపై ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల్లో ఎటువంటి దోషాలు జరగకుండా హిందూ మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు.
Jr NTR-Devara: జూనియర్ ఎన్టీఆర్‌ను తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం
28న తిరుపతికి జగన్...
తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయాల్లోకి దేవుడ్ని లాగడమే కాకుండా తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపిస్తూ, పాపప్రక్షాళన పేరుతో జగన్ డ్రామాలు షురూ చేశారు. ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు బుధవారం ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..
"తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, స్వామివారి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది" అని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఇక లడ్డూ వివాదంలో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 28న తిరుపతి వచ్చి అలిపిరి నడక దారిలో తిరుమల చేరుకుని 29న శ్రీవారిని దర్శించుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్
AP Govt: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షోకాజ్ నోటీస్
Read Latest AP News And Telugu News