AP Flood: ఏలేరు వరద ఉధృతి.. 25 వేల ఎకరాలు నీట మునక
ABN , Publish Date - Sep 10 , 2024 | 09:54 AM
Andhrapradesh: భారీ వర్షాలతో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది.216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది.
కాకినాడ, సెప్టెంబర్ 10: భారీ వర్షాలతో (Heavy Rains)గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. 216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు ఇతర అనుబంధ పంట కాలువలకు పది చోట్లకి పైగా గండ్లు పడ్డాయి.
Gaza - Israel: గాజాలో ఇజ్రాయెల్ మరో దాడి.. ఏకంగా 40 మంది మృత్యువాత
గొల్లప్రోలు పట్నంలోని మార్కండేయపురంలోకి ఏలేరు వరద నీరు ప్రవేశించాయి. గొల్లప్రోలు పట్టణ శివారులో ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై కూడా ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది.గొల్లప్రోలు పట్టణ శివారులోని వేరుశెనగ మిల్లులోకి వరద నీరు ప్రవేశించింది.ఏలేరు ఒకవైపు .. శుద్ధ గడ్డ మరోవైపు ముంచెత్తడంతో పంట పొలాల్లో భారీగా ముంపుపెరిగింది. గొల్లప్రోలు జగనన్న కాలనీ సూరంపేటలకు వెళ్లే రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
AP Politics: వైసీపీ నేతల్లో పెరుగుతున్న ఆందోళన.. జగన్ తీరుతో కేడర్ డీలా..
కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరైంది. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బలిమెల డ్యామ్ వద్ద ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 30 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. గోవిందపురం (విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం)లో 14, కృష్ణదేవిపేట (అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం), చింతపల్లి(అల్లూరి జిల్లా)లో 13, ముంచంగిపుట్టు(అల్లూరి జిల్లా), పెదనడిపల్లి(చీపురుపల్లి)లో 12, కాకరపాడు(అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం), రణస్థలంలో 11, పూసపాటిరేగ, భీమిలి, బొండపల్లి, బలిఘట్టంలలో 10, మెరకముడిదాం, చీపురుపల్లి, విశాఖపట్నం, గరివిడి, గంపరాయి, నర్సీపట్నం, ఎస్.రాయవరంలలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇవి కూడా చదవండి
Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?
AP Politics: వైసీపీ నేతల్లో పెరుగుతున్న ఆందోళన.. జగన్ తీరుతో కేడర్ డీలా..
Read Latest AP News And Telugu News