Share News

Raghurama: నన్ను దారుణంగా చిత్రవధ చేశారు..చంపాలని చూసారు

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:03 PM

తన కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రఘురామ కృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. తనను దారుణంగా చిత్రవధ చేశారని.. చంపాలని చూసారని అన్నారు. అందుకు సాక్ష్యంగా మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయన్నారు. న్యాయం గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Raghurama: నన్ను దారుణంగా చిత్రవధ చేశారు..చంపాలని చూసారు

న్యూఢిల్లీ: రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju ) కస్టోడియల్‌ టార్చర్‌ కేసు (Custodial torture case)లో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ ( CID Former Additional SP) విజయ్‌పాల్‌కు (Vijaypal) సుప్రీం కోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్‌ (FIR) నమోదు చేసిన నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ విజయ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ధర్మాసనం తీర్పుపై స్పందించిన ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ.. తన కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తనను దారుణంగా చిత్రవధ చేశారని.. చంపాలని చూసారని అన్నారు. అందుకు సాక్ష్యంగా మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయన్నారు. న్యాయం గెలుస్తుందన్నారు. త్వరలో తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న పెద్దవారంత బయటకు వస్తారన్నారు.


తాను ఇప్పుడు ఏ పార్టీపై విమర్శలు చేయనని.. తన కేసు గురించి మాట్లాడే హక్కు తనకుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సభలో శాసన సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని, శాసన సభా సమావేశాలు సంతృప్తికరంగా జరిగాయన్నారు. గుజరాత్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాలు లేవని, మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష హోదా ఉండదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి సభకు వస్తే ఆయనకు సమయం ఇవ్వడం జరుగుతుందని, ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు ఆయన సభకు వచ్చి మాట్లాడొచ్చుకదా అని అన్నారు. జగన్ సభకు రావలన్నది ప్రజల ఆకాంక్ష అని... ఆయన కాంక్ష తీరలేదని అందుకే సభకు రావడం లేదని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అండమాన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో బిగ్ ట్విస్ట్..

ఆ ఘటనకు బీజేపీదే బాధ్యత: రాహుల్

చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 25 , 2024 | 02:03 PM